ఓరినాయనో.. ఈ మేకల యాక్టింగ్ కి ఆస్కార్ ఇవ్వాల్సిందే?

praveen
సాధారణంగా మనుషులు మాత్రమే సందర్భానుసారంగా యాక్టింగ్ చేసేస్తూ ఉంటారు అని చెప్పాలి. కేవలం సినిమాల్లో కనిపించే యాక్టర్లు కాదు కొంతమంది మనుషులు అయితే అంతకుమించి అనే రేంజ్ లోనే ఇక టైం కి తగ్గట్టుగా యాక్టింగ్ చేసి అందరిని నమ్మిస్తూ ఉంటారు. ఇక ఇలా సందర్భానుసారంగా కొంతమంది యాక్టింగ్ చేయడం చూసి నీకుఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ పక్కనే ఉన్నవారు సరదాగా కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదండోయ్ జంతువుల సైతం మనుషుల కంటే కాస్త ఎక్కువగానే నటిస్తూ ఉంటాయి అన్నది మాత్రం కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది.

 ఇలా ఏకంగా మనుషుల మాదిరిగానే కోతులు కూడా కొన్ని సందర్భాల్లో విచిత్రంగా నటించడం లాంటి వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి వెలుగులోకి వస్తూ అందరి ముఖాల్లో నవ్వులు పూజిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. సాధారణంగా మేకలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో ఉన్న మేకలు మాత్రం నటనలో పీహెచ్డీ చేశాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో యాక్టింగ్ చేశాయి. ఇక ఈ మేకలు చేసిన యాక్టింగ్ చూసిన తర్వాత మాత్రం వీటికి ఆస్కార్ ఇవ్వాల్సిందే అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కొంతమంది తమను కారు ఢీకొట్టక పోయినప్పటికీ ఇక యాక్టింగ్ చేస్తూ కిందపడిపోతూ ఉంటారు. ఇక్కడ మేకలు కూడా ఇలాంటివే చేశాయి. ఒకచోట గడ్డిమేస్తూ ఉన్నాయి కొన్ని మేకలు. ఇక ఇంతలో అటువైపుగా ఒక పార్సెల్ ట్రక్కు వచ్చింది. ఇక ఆ ట్రక్కు మేకలకు కాస్త దగ్గర నుంచి వెళ్లడంతో.. మేకలు అన్నీ కూడా ఉన్నటువంటి ఒక్కసారిగా కింద పడిపోయాయి.  ఇక ఏకంగా ఆ ట్రక్కు వాటిని ఢీ కొట్టిందేమో అన్న విధంగా కింద పడిపోయి గిలగిలా కొట్టుకున్నాయి. ఇక ఈ వీడియో చూసి నేటిజన్లు అందరూ తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: