' ఎకో-ఫ్రెండ్లీ దీపావళి ' గురించి ఈ కుర్రాడు ఏం చెప్పాడో చూడండి..

frame ' ఎకో-ఫ్రెండ్లీ దీపావళి ' గురించి ఈ కుర్రాడు ఏం చెప్పాడో చూడండి..

Satvika
దీపావళికి ఇంకా ఒక్క రోజు ఉండగానే అప్పుడే దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి..పిల్లలకు ఈ పండుగ అంటే ఎంత సరదానో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ప్రభుత్వం కాలుష్యం పై అవగాహన కల్పిస్తూ వస్తుంది.ఈ మేరకు టపాసుల ను ఎలా కాల్చాలి అనే విషయం పై పదే పదే చెబుతూ వస్తుంది.అయితే ' ఎకో-ఫ్రెండ్లీ దీపావళి గురించి కూడా మరో వైపు చర్చలు జరుగుతున్నాయి.దీపావళి వచ్చిందంటే చాలు ముందుగా అందరికి గుర్తుకొచ్చేది టపాసులు, రకరకాల స్వీట్లు..
అయితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడం నిషేధించారు. అయితే ప్రజలు ' ఎకో-ఫ్రెండ్లీ దీపావళి ' జరుపుకోవాలని సూచించారు.



అయితే బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నా అక్కడక్కడా పటాకులు కలుస్తూనే ఉన్నారు. అయితే నిషేధం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది , అందులో ఒక యువకుడు తాను దీపావళిని స్నేహపూర్వకంగా.. పర్యావరణ పరిరక్షణ కలిగే విధంగా జరుపుకుంటానని చెప్పాడు. అతని మాటలు వింటే మీరు తప్పకుండా నవ్వుతారు.


వీడియోలో మీరు ఒక రిపోర్టర్ మైక్‌తో నిలబడి ఒక అబ్బాయిని 'ఏం చేస్తారు' అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆ యువకుడు తాను చదువుకుంటున్నానని చెప్పాడు. దీని తర్వాత విలేఖరి అతనిని.. మీరు దీపావళిని ఎలా జరుపుకుంటారు.. క్రాకర్లు పేల్చి జరుపుకుంటారా.. అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆ యువకుడు.. తాను పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకుంటానని సమాధానమిచ్చాడు. అప్పుడు రిపోర్టర్ 'మీరు క్రాకర్స్ పేల్చకపోతే దీపావళిని ఎలా ఎంజాయ్ చేస్తారు?' అని అడగ్గా, దానికి సమాధానంగా 'మేము క్రాకర్స్ పేల్చము, మేమే క్రాకర్స్' అని అబ్బాయి చెప్పాడు. ఇప్పుడు అతని ఫన్నీ సమాధానం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..అతను ఘనుడే అంటూ కామెంట్లు కుడా వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: