కారు పైకి దూసుకొచ్చిన హెలికాప్టర్.. వీడియో చూస్తే షాకే?
ఏకంగా ఒక పెద్ద రహదారిపై దూసుకుపోతున్న కారు పైకి ఒక భారీ హెలికాప్టర్ దూసుకొచ్చింది. దీంతో కారులో ఉన్న డ్రైవర్ ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసి పోయినంత పని అయింది అని చెప్పాలి.. నిజంగా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజంగానే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక వైపు కారు దూసుకు వెళ్తుంటే మరోవైపు నుంచి హెలికాప్టర్ దూసుకు వచ్చింది. అయితే పైలెట్ ఎంతో చాకచక్యంగా హెలికాప్టర్ ను కాస్త పక్కకు తిప్పడంతో ఇక ప్రమాదం తప్పింది.. లేదంటే కారు హెలికాప్టర్ ఢీకొట్టేవి అని చెప్పాలి.
ఇలా వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది అని చెప్పాలి. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.. ఇంకెక్కడ ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో దద్దరిల్లిపోతున్న ఉక్రెయిన్ లోని హైవేపై జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వెల్కమ్ టు ఉక్రెయిన్ అనే క్యాప్షన్ జోడించింది. ఈ వీడియో చూస్తున్న నేటిజన్లు అటు పైలెట్ ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటే.. ఇంకొంతమంది నెటిజన్లు మాత్రం ఇక ఇలాంటి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఏదేమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.