గిన్నిస్ రికార్డు కోసం.. ఎలాంటి సాహసం చేసాడో చూడండి?

praveen
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కానీ ప్రపంచ రికార్డు కొట్టడం అంటే అంత సులభమైన విషయం కాదు. ప్రపంచం లో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమం లోనే ఇలాంటి ప్రపంచ రికార్డు కొట్టేందుకు కొంత మంది ఎన్నో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.



 ఈ క్రమం లోనే ఇలా ప్రపంచ రికార్డును కొట్టేందుకు కొంత మంది ఏకంగా తమ ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టేసి ఏదో ఒక ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం లాంటివి ఇప్పటి వరకు ఎన్నో సోషల్ మీడియాలో చూసాం. ఇక్కడ ఒక వ్యక్తి మరో సారి అందరికంటే భిన్నం గా ప్రయత్నించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇంతకీ ఇలా ప్రపంచ రికార్డు కొట్టడానికి ఇక్కడ ఉన్న వ్యక్తి ఏం చేశాడో తెలుసా..  కొవ్వొత్తులను వెలిగించాడు. అదేంటి కొవ్వొత్తులను వెలిగిస్తే గిన్నిస్ రికార్డు కొట్టవచ్చా అని అనుకుంటున్నారు కదా.


 అలా అనుకున్నారంటే పొరపాటే.. ఏకంగా 150 కొవ్వొత్తు లను తన నోట్లో పెట్టుకుని వెలిగించాడు. ఓహ్.. కొవ్వొత్తులను కొవ్వొత్తులను వెలిగించడం లో ఇలాంటి కిటుకు ఉందా.. అయితే గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వాల్సిందే అంటారు ఎవరైనా. గతంలో డిసెంబర్లో ఇదే రికార్డును ప్రయత్నించాడు అతను. కానీ కొన్ని కొవ్వొత్తుల నోటి నుంచి పడిపోవడం తో విఫలమయ్యాడు. ఇక అతను ఇలా 150 కొవ్వొత్తులను నోట్లో పెట్టుకుని దాదాపు 50 సెకండ్ల పాటు అలాగే పట్టుకున్న వీడియోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: