వైరల్ : హమ్మయ్య.. జస్ట్ మిస్.. లేదంటేనా?

praveen
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రోడ్డు ప్రమాదాలు ఎవరూ కావాలని చేయరు అనే విషయం తెలిసిందే. మామూలుగానే ఎప్పటిలాగా రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఊహించిన విధంగా చివరికి రోడ్డు ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి. అయితే ఇలా రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు ఇక వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ముఖ్యంగా అడవి మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇక సింహం పులి ఏనుగు లాంటి ఏవైనా ప్రమాదకరమైన జంతువులు వచ్చినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.


 కానీ కొంతమంది మాత్రం మాత్రం ఏకంగా రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో ప్రమాదం నుంచి బయటపడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడు ఎన్నో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అని చెప్పాలి  ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. సాధారణంగా గజరాజును చూస్తేనే అందరూ వనికి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గజరాజు ఒక్కసారి కోపం వచ్చి దాడి చేసింది అంటే చాలు ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలుసు.


 ఇక్కడ ఒక మహిళ రోడ్డు దాటుతున్న గజరాజును తన స్కూటర్తో ఢీకొట్టడానికి వెళ్ళింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా కాదు పొరపాటున జరిగింది. ఇక ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరి ప్రాణాలు పోతాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో చివరికి గజరాజుకు గాని బైక్ పై ఉన్న వ్యక్తులకు గాని ఎలాంటి గాయాలు కాకుండానే బయటపడ్డారు. ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. 5 సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: