స్వేచ్ఛ అంటే ఇదేనేమో.. ఉడతను చూసి నెటిజన్లు ఫిదా?
సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని వీడియోలను చూసినప్పుడు ఎంతో ఒత్తిడిలో ఉన్నా కూడా మనసు కాస్త తేలిక అనిపిస్తూ ఉంటుంది. బాధ నుంచి కొన్ని కొన్ని సార్లు కుదుటపడేలా చేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో తారాస పడుతూ ఉంటాయి. ఇక ఇలా మీ మానసిక పరిస్థితిని రిఫ్రెష్ చేసే ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోయింది. అటు జనాలకు దగ్గరగా ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తూ అందంగా కనిపించే చిన్న జంతువులలో ఉడుత కూడా ఒకటి. జనాలు ఉండే ప్రదేశాలలో ఉడతలు దాదాపుగా కనిపించవు.. కనిపించిన ఎంతో వేగంగా దూరంగా పరిగెడుతూ ఉంటాయి.
కానీ ఇక్కడ ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఏకంగా ఉడక సంతోషంతో ఊగిపోతుంది. అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడంతో చిన్నపిల్లలు గ్రౌండ్లో బంతితో ఆడుకున్నట్లుగానే అక్కడ ఉన్న ఉడతా ఒక బంతితో ఎంచక్కా ఆడుకుంటుంది. ఇక ఈ బంతితో ఆడుకుంటూ ఉడత చేసే చిలిపి చేతులు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును తెప్పిస్తాయి అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఎంతోమందిని నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. స్వేచ్ఛ అంటే ఇదేనేమో అటు కామెంట్లు చేస్తున్నారు.