నిర్లక్ష్యంగా కార్ డోర్ తీస్తే ఇలాంటి ప్రమాదాలు తప్పవు?

Purushottham Vinay
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోడ్ సేఫ్టీ అధికారులు షేర్ చేసిన ఓ షాకింగ్‌ వీడియో అందరినీ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ చూసుకోకుండా కారు డోర్ తెరిస్తే ఏమవుతుందో తెలిపేందుకు ఓ హెచ్చరికగా దీనిని షేర్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో కూర్చున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కారు డోర్‌ తెరుస్తాడు. వెనుక వైపు నుంచి స్కూటర్‌పై వస్తున్న మహిళా ప్రయాణికురాలు రాంగ్ సైడ్‌లో అకస్మాత్తుగా తెరుచుకున్న కారు డోర్‌ తగిలి రోడ్డుపై పడిపోతుంది. ఇంతలో వెనుకవైపు నుంచి వస్తున్న కారు టైర్ల కింద మహిళ పడిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఐతే సదరు మహిళకు ఏమైందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. వీడియోలో కన్పిస్తున్న టైం, తేదీలను బట్టి ఈ దుర్ఘటన సెప్టెంబర్‌ 24న జరిగినట్లు తెలుస్తోంది.'పబ్లిక్‌ రోడ్లపై కారు డోరు ఓపెన్ చేసే ముందు, వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తే ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ కర్ణాటక రాష్ట్ర రోడ్డు భద్రతా అథారిటీ తన ట్విటర్ ఖాతాలో ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది.



ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. 'కారు డోర్‌ తీసిన వ్యక్తిని అరెస్టు చెయ్యాలి'. 'కారు డోర్ తెరిచే ముందు వెనుక ఏదైనా వాహనం వస్తుందో.. లేదో.. అద్దంలో చెక్‌ చేసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. దురృష్టవశాత్తు చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు' అని పలువురు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను తెలిపారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కూడా ఒక పాఠంలాగా నిలుస్తుంది. కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి మీ ప్రాణానికి కానీ లేదా వేరే వాళ్ళ ప్రాణాలకు గాని మీరు హాని తలపెట్టొద్దు. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: