వైరల్ : వామ్మో.. ఎంత దారుణంగా కొట్టుకున్నారు?

praveen
ఇప్పుడంతా ఆన్లైన్ మయం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. చివరికి తినే ఆహారం కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల వ్యవధిలో ఇంటిముందు వాలిపోతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తాము ఉన్నచోటకే తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేసి డెలివరీ పొందుతున్నారు నేటి రోజుల్లో. ఇలా ఎంతో మంది కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు ఎన్నో రకాల సంస్థలు సర్వీస్ లు అందిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ఫుడ్ డెలివరీ బాయ్స్ కి కొన్ని కొన్ని సార్లు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

 నోయిడాలో గల కోత్వాల్ ఏరియాలో గల సెక్టార్ 39 గార్తేనియా సొసైటీలో ఇటీవల డెలివరీ బాయ్ సెక్యూరిటీ గార్డు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది అనిచెప్పాలి. ఇక ఒక కస్టమర్ ఆర్డర్ ఇవ్వడంతో అక్కడికి ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ కార్డు మాత్రం అతని లోపలికి పంపించలేదు. అంతేకాదు ఇద్దరి మధ్య మాటలు యుద్ధం కూడా జరిగింది. సెక్యూరిటీ గార్డ్ మాటలతో తీవ్ర ఆగ్రహానికి గురైన డెలివరీ బాయ్.. సెక్యూరిటీ కార్డు పై దాడికి దిగాడు.

 ఇక ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు  కురిపించుకున్నారు   అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇద్దరూ కర్రలను చేతిలో తీసుకొని దారుణంగా దాడి చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో అక్కడ సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఇక ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడం.. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెలివరీ బాయ్ గా ఉన్న సాబీ సింగ్, సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న రామ్ వినయ్ శర్మను అరెస్టు చేశారు. వీరిద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని చెప్పాలి. అయితే వీరిద్దరూ కూడా దారుణంగా కొట్టుకున్న వీడియో చూసి నెటిజన్లు అందరూ అవాక్కవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: