గొడవపడుతున్న విద్యార్థులను ఢీకొన్న కారు?

Purushottham Vinay
సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా అనేక రకాల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అందులో చిన్నారుల చిలిపి చేష్టలు, స్కూల్ పిల్లల అల్లరి పనులు, కాలేజీ విద్యార్థులు చేసే వినూత్న ప్రయత్నాలు, గొడవలు, కొట్లాటలు వంటివి నిత్యం కూడా తెగ వైరల్ అవుతుంటాయి.ఇక అలాంటిదే ఈ వీడియో కూడా..నడి రోడ్డుపై పోరాడుతున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ ఇద్దరు యువకులు ఎగిరి అంతదూరంలో పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 23 సెకన్ల వ్యవధి గల ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాకు చెందినదిగా తెలిసింది. ఘజియాబాద్‌లోని మసూరి ప్రాంతంలో కొందరు విద్యార్థులు నడిరోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. అది వాహనాల రద్దీగా ఎక్కువగా ఉన్న ప్రాంతంగా తెలుస్తుంది.అయితే,రోడ్డుపైనే విద్యార్థులు గొడవపడుతుండగా,.. అకస్మాత్తుగా తమ వైపు వెళ్తున్న కారును చూసి వారు పక్కకు తప్పుకునేందుకు పరిగెత్తారు. కానీ, వెనకనుంచి వచ్చి మరో కారు ఆ యువకులను ఢీకొట్టింది. 


అదృష్టవశాత్తు అప్పుడు కారు వేగం అదుపులో ఉండటంతో యువకులు పక్కకు ఎగిరిపడ్డారు తప్ప ఎలాంటి అపాయం కలుగలేదు. వాహనం వారిని వెనుక నుంచి ఢీకొట్టడంతో విద్యార్థి కాలి చెప్పులు మాత్రమే ఊడిపడిపోయాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ విద్యార్థులు తిరిగి తమ గొడవను ఆపలేదు. పడిలేచిన తర్వాత కూడా ఘర్షణ పడ్డారు. ఇరువురు కాలర్‌ పట్టుకుని గొడవకి దిగారు.మసూరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కొంతమంది కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో ఒక కారు వారిలో కొందరిని ఢీకొట్టింది. ప్రాథమిక విచారణ అనంతరం కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు అని పోలీసుల తెలిపారు. ఇక వైరల్ వీడియోలో కనిపిస్తున్న కారును కూడా సీజ్ చేశామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: