పక్షులు గాల్లో ఎగురుతున్న సంగతి తెలిసిందే..అలాంటి అనుభూతి కలగాలని విమానాలను కనిపెట్టారు.విమానాలు, రాకెట్ లు,హెలికాఫ్టర్ లు గాల్లో ఎగరడం మనం చూసే ఉంటాము..కానీ వాటి మాదిరిగా గాల్లో ఎగిరే బైకును ఎప్పుడైనా చుసారా? బహుశా చూసి ఉండరు. ఇప్పుడు మొదటి గాల్లో ఎగిరే ఈ బైకు గురించి వివరంగా తెలుసుకుందాం…
అమెరికాకు చెందిన ఒక సంస్థ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి హోవర్ బైక్. దీని పేరు ఎక్స్‌టీయూఆర్ఐఎస్‌ఎమ్ఓ. ఈ బైకును అక్కడ మీడియాకు ప్రదర్శించారు. అమెరికాకు చెందిన ఒక టెక్నాలజీ సంస్థ ఈ బైకును తయారు చేసింది. ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన నార్త్ అమెరికన్ ఆటో షోలో ఈ బైకును ఆ సంస్థ ప్రదర్శించింది. ఈ హోవర్ బైక్ 40 నిమిషాలపాటు గాల్లో ఎగరగలిగే సామర్ధ్యం కలిగి ఉంది. ఈ బైకు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుందని తెలుస్తుంది..
ప్రస్తుతం కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మన కరెన్సీలో దాదాపు రూ.6 కోట్లకు పైనే ధర ఉండొచ్చు. కానీ, 2025కల్లా ధర తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌ను అమెరికా ప్రభుత్వం నాన్-ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్‌గా పరిగణిస్తుందని కంపెనీ భావిస్తోంది..ప్రస్తుతం ఈ బైకు ట్రైల్స్ లో ఉంది. త్వరలోనే అన్నీ పనులను పూర్తి చేసుకొని మార్కెట్ లోకి విడుదల చేస్తామని ఆ సంస్థ పేర్కొంది.. ఈ ఎగిరే బైకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. చూడటానికి అచ్చం బుల్లి హెలికాఫ్టర్ లా ఉండటంతో మార్కెట్ లోకి రాగానే మంచి డిమాండ్ వుంటుందని సంస్థ భావిస్తుంది..ఆ బైక్ ఎలా వుందో మీరు వీడియో లో చూడండి..