జారుడు బల్లపై ఎలుగుబంటి.. భలే ఎంజాయ్ చేసింది?
ఇక ఇలాంటి తరహా వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇలాంటివి చూసినపుడు నెటిజన్లు ఎలుగు బంట్లు చేసిన పనికి తెగ నవ్వుకుంటూ ఉంటారు.. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది సాధారణంగా పిల్లలు ఆడుకోవడానికి అక్కడక్కడ జారుడు బల్ల ను ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చిన్నారులు ఆ జారుడు బల్ల పై ఎక్కి పైనుంచి కిందికి జారుతూ తెగ సంబరపడిపోతూ ఉంటారు. అయితే ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక భారీ ఎలుగుబంటి కూడా ఇలాగే నెమ్మదిగా జారుడు బల్ల పైకి ఎక్కింది.
ఇక ఆ తర్వాత ఆ జారుడు బల్ల మీద నుంచి కిందకి పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మెల్లగా జారుతూ కిందకు దిగింది. ఇక ఇది చూసిన నెటిజన్లు అందరూ కూడా ఎలుగుబంటి తెలివికి ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఎలుగు బండి చేసిన పనికి కాస్త నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ట్విట్టర్లో పోస్టు చేయగా ఎంతోమంది లైకులు కొట్టేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఎంతో మంది తమ స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై క్లిక్ చేయండి.