డెలివరీ బాయ్ చేసిన పనికి ఫిదా అయిన మహిళా కస్టమర్..!!
ఇక అసలు విషయానికొస్తే.. ఓ వ్యక్తి తన పని మీద ఉన్న డెడికేషన్ చూపించాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. కదులుతున్న రైలును సైతం చేజ్ చేసి ఓ కస్టమర్ కు వస్తువును డెలివరీ చేశాడు.అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.వివిధ రకాల వస్తువుల ను హోమ్ డెలివరీ అందించే డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న రైలు వెంట పరుగెత్తి మరీ తన కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువుల ను అందించాడు. కాగా, సదరు మహిళా కస్టమర్.. ఆ ఏజెంట్ అందించిన వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది..
ఆ వీడియోలో డంజో డెలివరీ బాయ్ స్టేషన్‌లో పరుగెత్తుకుంటూ కనిపిస్తాడు. రైల్వే ఫ్లాట్‌ఫాంపై రైలు నెమ్మదిగా కదులుతోంది. క్రమంగా రైలు వేగం పెరిగింది. ఇంతలోనే డంజో డెలివరీ బాయ్ ఓ సంచితో పరుగెత్తుకుంటూ ఫ్లాట్ ఫాంపైకి వచ్చాడు. రైలులో డోర్ వద్ద నిలబడిన ఓ మహిళ డంజో డెలివరీ బాయ్‌ను ఫాస్ట్.. ఫాస్ట్ అంటూ చేతులతో సైగలు చేసింది. దీంతో, అతను రైలు వెంట వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలోని ఆర్డర్‌ను సదరు మహిళకు అందించాడు..దాంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్ ఇవ్వాలని,డబల్ టిప్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.