రోడ్లపై గుంతలు.. అతను ఎలా నిరసన తెలిపాడో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన రహదారులన్ని కూడా పూర్తిగా పాడైపోయాయ్. ఈ క్రమం లోనే గుంతల మయం గా మారిన రహదారులపై ప్రయాణం వాహనదారులు అందరికీ కూడా ప్రాణసంకటంగా మారిపోతుంది అని చెప్పాలి. ఇక గుంతల కారణంగా ఎంతోమంది  రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు  కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రోడ్లు బాగు చేయాలని ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు అని తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా వినూత్నమైన నిరసన చేపడుతున్నారు. ఎవరైనా రహదారుల గురించి సరికొత్తగా నిరసన చేపట్టారు అంటే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒక ట్వట్టర్ లో లో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే కర్ణాటకలోని ఉడిపి లో ఉన్న రహదారిలో గుంతల మయంగా మారిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


 ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో  ఇటీవలే ఒక సామాజిక ఉద్యమకారుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. రోడ్లపై ఉన్న గుంతలకు హారతి ఇవ్వడమే కాకుండా పొర్లు దండాలు పెట్టాడు. కాగా వీడియో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిపోయాయ్. ఉడిపి లోని రోడ్లు అయితే మరింత దారుణంగా మారిపోయాయ్. ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా సదరు సామాజిక ఉద్యమ  పేరు నిత్యానంద. జాతీయ రహదారి నిర్మాణానికి మూడేళ్ళ క్రితమే టెండర్లు వేసిన ఇప్పటి వరకు రోడ్డు నిర్మించలేదని  అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరుతూన్నాడు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: