వైరల్ : జనవరి స్పెల్లింగ్ అడిగిన రిపోర్టర్.. టీచర్ ఏం చెప్పిందో తెలుసా?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఇక జీవితానికి సరైన అర్థం నేర్పేది మాత్రం ఉపాధ్యాయులే అని చెప్పాలి. అందుకే తల్లిదండ్రులు ప్రతిరోజు తమ పిల్లలను బడికి పంపించి ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా టీచర్లు ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్టు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది టీచర్లు మాత్రం వారు విద్యార్థులకు బోధించే సబ్జెక్టు విషయంలో కూడా పూర్తి నాలెడ్జి కలిగి ఉండరు అని చెప్పాలి. కొంతమంది మ్యాథ్స్ టీచర్లకు చిన్న చిన్న లెక్కలు కూడా సరిగ్గా రావు. అలాగే ఇంగ్లీష్ టీచర్లకు కనీసం ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదు అని చెప్పాలి.

 ఇటీవలి కాలంలో ఎంతో మంది ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు పైనే సరైన ఆలోచన లేక ఇబ్బంది పడుతున్న వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటీ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఉన్నతాధికారులు వచ్చి ఇక టీచర్లకు వారు చెబుతున్న సబ్జెక్టుల నుంచి ఏదైనా ప్రశ్న అడిగితే తెల్లమొహం వేస్తుంటారు. ఇక్కడ ఇదే జరిగింది. రిపోర్టర్లు ఒక పాఠశాలకు వెళ్లే టీచర్లను స్టూడెంట్స్ ని ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడ ఒక టీచర్ ని జనవరి  స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో ఏంటి అంటూ అడుగుతాడు రిపోర్టర్.

 సదరు టీచర్ తప్పించుకోవడానికి నన్ను ఎందుకు అడుగుతున్నారు స్టూడెంట్స్ ని అడగండి అని చెబుతోంది. మీరు చెప్పండి అంటూ రిపోర్టర్ అడగగా.. లేదు లేదు స్టూడెంట్స్ ని అడగండి అంటూ తడబడుతుంది టీచర్. ఆ తర్వాత రిపోర్టర్ స్టూడెంట్స్ ని అడగగా  జనవరి నెల స్పెల్లింగ్ తప్పు చెబుతారు.  ఇప్పుడు మీరు చెప్పండి అంటూ రిపోర్టర్ మళ్ళీ టీచర్ ని అడుగుతాడు. ఇక ఆమె కూడా జనవరి స్పెల్లింగ్ తప్పు చెప్పడంతో అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి టీచర్లను ఇక పిల్లల భవిష్యత్తు ఇంకేం బాగుపడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: