వైరల్ : అయ్య బాబోయ్ భారీ మొసలి.. చూస్తే వణుకే?
అయితే ఇటీవలి కాలంలో మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో అటు జనావాసాల్లోకి వరద నీరు రావడం కారణంగా సరస్సులు నదులు లో ఉండే మొసళ్లు ఏకంగా జనావాసాల్లోకి కొట్టుకు రావడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుట్టింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఎక్కడో సరస్సులు నదులు లో ఉండే మొసలి జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది.
ఇక భారీ ఆకారం ఉన్న ఈ మొసలి ని చూసి స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లోని శివకోటి గ్రామస్తులకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నివాస ప్రాంతం లోకి మొసలి కొట్టుకొని వచ్చింది. వీడియో కాస్త ట్విట్టర్ లో తెగ చక్కెర్లు కొడుతుంది. పాత బస్టాండ్ సమీపంలోని ఓ కాలనీలో కనిపించింది. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం గంటకు పైగా కష్టపడి బంధించారు. ఆ తర్వాత నేషనల్ పార్క్ ఆవరణలో ఉన్న సాంఖ్య సాగర్ లో ఆ మొసలిని విడిచి పెట్టారు అని చెప్పాలి.