వైరల్ : రైలు పైనకు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ.. అంతలో ట్విస్ట్?

praveen
సాధారణంగా  ఆర్.టి.సి బస్సులో ఎక్కిన సమయంలో.. ఒకవేళ బస్సు లోపల ఫుల్ గా ఉంటే ఫుడ్ బోర్డింగ్  చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతో మంది విద్యార్థులు యువకులు. ఇక కొన్ని కొన్ని సార్లు బస్సు పైన కి కూడా ఎక్కడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం బస్సు ప్రయాణాలు విషయంలోనే కాదు రైలు ప్రయాణాల విషయంలో కూడా ప్రయాణికులు ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేస్తూ ఉంటారు. రైలు డోర్ వద్ద వేలాడటం.. ఒక వైపు రైలు వస్తూ ఉంటే.. అదే సమయంలో పట్టాలు దాటడం.. ప్రమాదకరం అని తెలిసినప్పటికీ డోర్ వద్ద నిలబడి  సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 కొన్నిసార్లు ఇక డోర్ దగ్గర నుంచి కాకుండా కిటికీలోనుంచి రైల్లోకి ఎక్కడం లాంటివి కూడా ఎన్నో సార్లు చూశాము. అయితే ఇలాంటివి చేసి చివరికి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ వుంటారు ఎంతోమంది.  ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక మహిళ ఏకంగా రైల్లోకి వెళ్లేందుకు కాదు రైలు పైన ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆమెకు ఎక్కడానికి సాధ్యం కావడం లేదు. పైన ఉన్న వాళ్ళు సదరు మహిళకు సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. కాని అంతలో  ఊహించని ట్విస్ట్. పోలీస్ అక్కడికి రావడంతో మహిళ ఒక్కసారిగా రైలు నుంచి కిందకు దూకి పారిపోయింది.


 అయితే అదే రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి వచ్చిన మరో ప్రయాణికుడు మహిళ రైలు ఎక్కుతూ ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇదంతా ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఇక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రైలు మీద ఉన్న పేరు ఆధారంగా బంగ్లాదేశ్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతో మంది నెటిజన్లు  ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. పాపం సదరు మహిళ పోలీసు రాకపోయి ఉంటే హాయిగా రైలు పైనకు ఎక్కేది కదా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: