నువ్వు వద్దు.. నీ ఐస్ క్రీమ్ వద్దు.. బుడ్డోడు ఏం చేశాడో చూడండి?

praveen
సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కోన్ ఐస్ క్రీం గురించి తెలిసే ఉంటుంది. ఎక్కడైనా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు లేదా స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ఎంతోమంది. అయితే ఇలా కోన్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్లిన కస్టమర్లను సరదాగా ఆటపట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు కోన్ ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తులు. కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చినట్లుగానే ఇచ్చి మళ్ళీ లాక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా అమ్మే వ్యక్తుల దగ్గర నుంచి ఐస్ క్రీమ్  తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటివి ప్రత్యక్షంగా అనుభవాన్ని చూసాము.. మరి కొంతమంది వీడియోల ద్వారా చూసి ఆనందించారు.

 ఇలా కోన్ ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన కస్టమర్లను అమ్మే వ్యక్తులు ఎలా ఆటపట్టిస్తారు అన్న దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటివరకు చాలానే వైరల్ గా  మారిపోయాయ్ అని చెప్పాలి. ఎంతో మంది ఇలాంటి వీడియోలు తమ సోషల్ మీడియా ప్రసారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇలా కోన్ ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తులు ఆటపట్టిస్తూ సమయంలో కొంతమంది కస్టమర్లకు చిరాకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కస్టమర్కు ఇలాంటి చిరాకు వచ్చింది. దీంతో నువ్వు వద్దు నీ ఐస్ క్రీమ్  వద్దు అంటూ కోపగించుకున్నాడు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోలో చూసుకుంటే ఒక బుడ్డోడు కోన్ ఐస్ క్రీమ్ తినాలి అని భావించాడు.  ఈ క్రమంలోనే అమ్మే వ్యక్తి అతన్ని ఆట పట్టించాడు. పలుమార్లు అతని చేతికి ఐస్ క్రీమ్  ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నాడు. ఈ క్రమంలోనే ఆ బుడ్డోడికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో నువ్వు వద్దు.. నీ ఐస్ క్రీం  వద్దు అన్నట్లుగా తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్  కప్ ను నేలకేసి కొట్టి కాలితో తొక్కేసాడు. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: