వైరల్ : తాగిన మత్తులో సెక్యూరిటీ కార్డు.. లేడీస్ హాస్టల్ లోకి దూరి?

praveen
సాధారణంగా సెక్యూరిటీ గార్డుగా పని చేసే వ్యక్తులు తాము పని చేసే ఇళ్లకు, కంపెనీలకు ఎలాంటి అపాయం తలెత్తకుండా దొంగలు వచ్చి చోరీ చేయకుండా ఉండేలా కాపలా కాస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతోమంది సెక్యూరిటీ గార్డులు కాపలా కాయడం కాదు.. ఇంటి దొంగలు గా మారిపోతున్నారు అనే చెప్పాలి. కొంతమంది అందినకాడికి దోచుకోవడం లాంటివి చేస్తూ ఉంటే మరికొంతమంది దారుణంగా ప్రవర్తిస్తున్నారూ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. అతను లేడీస్ హాస్టల్ కి సెక్యూరిటీ గార్డు గా వ్యవహరిస్తున్నాడు.

 ఈ క్రమంలోనే ఇక హాస్టల్ లో ఉన్న అమ్మాయిలు అందరికీ కూడా ఎలాంటి అపాయం తలెత్తకుండా ఉండేలా అతడు కాపలా కాస్తూ ఉండాలి. కానీ తాగిన మత్తులో ఏకంగా లేడీస్ హాస్టల్ లోకి చొరబడి ఒక యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో వెలుగులోకి వచ్చింది.

 ఈ వీడియోలు చూసుకుంటే హాస్టల్ కారిడార్ లో నుంచి వెళ్తున్న యువతులు మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును  చూసి ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు  ఇంతలో ఓ యువతి ఆ సెక్యూరిటీ గార్డ్ చేతికి చిక్కింది.ఈ క్రమంలోనే ఇక సదరు యువతిని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం తో పాటు దాడికి పాల్పడ్డాడు సెక్యూరిటీ గార్డ్. అయితే ఘటనపై యువతులు అటు హాస్టల్ ఓనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక ఈ సిసి టివి ఫుటేజ్ ద్వారా ఢిల్లీ ఉమెన్ కమిషనర్ స్పందిస్తూ చివరికి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: