వైరల్ : ట్రైన్ లో సీటు కోసం.. మహిళలు ఎలా గొడవపడ్డారో చూడండి?

praveen
సాధారణంగా మగాళ్లు అయినా సరే గొడవలు విషయంలో కాస్త వెనక ముందు ఆలోచిస్తారేమో కాని ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుంటారు అని ఎప్పుడూ ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. అంతే కాదు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక్కసారి గొడవ ప్రారంభమైంది అంటే చాలు ఇక ఆ గొడవను ఆపడం ఎవరితరమూ కాదు అని చెబుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే కొన్ని వీడియోలు ఇది నిజమే అని చెప్పకనే చెబుతుంటాయి. ముఖ్యంగా బస్సుల్లో రైళ్ళలో జర్నీ చేస్తున్న సమయంలో కొంతమంది వ్యవహరించే తీరు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. పూర్తిగా తమ సొంత డబ్బుతో బస్సు నడుస్తుంది అన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు.

 ఒక సీట్ లో కూర్చోడమే కాదు ఇక మిగతా సీట్లలో కూడా ఏదో ఒక వస్తువు పెట్టి ఆక్రమించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇతరులు వచ్చి సీట్ ఖాళీ చేయాలి అని అడిగినప్పుడు కూడా ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు అని చెప్పాలి. ఏదైనా అంటే వాగ్వాదానికి దిగుతు ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఇటీవల కాలంలో ఎంతోమంది అమ్మాయిలు లవర్ కోసం నడిరోడ్డు మీద కొట్టుకోవడం ఇక వస్తువుల కోసం జుట్టు పట్టుకునే వీడియోలు చూశాము. ఇప్పుడు  సీటు కోసం ఇద్దరు ఆడవాళ్లు గొడవ పడ్డారు.
 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన వెలుగు చూసింది. మెట్రో రైలులో లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎక్కింది  ఒక యువతి. అయితే అప్పటికే అక్కడ మరో మహిళ మరికొంత మంది అక్కడ కూర్చుని ఉన్నారు..అయితే సీటు పక్కన తన బ్యాక్ కూడా పెట్టుకుని ఒకరి స్థానాన్ని ఆక్రమించింది సదరు మహిళ. దీంతో మెట్రో ట్రైన్ ఎక్కిన అమ్మాయి కాస్త బ్యాగ్ జరపాలని కోరింది. కాని మహిళ మాత్రం వాగ్వివాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం ఒక్కసారిగా పెరిగిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: