యాక్షన్ మూవీని తలపిస్తున్న పోలీస్ రియల్ ఛేజ్?

Purushottham Vinay
ఇక ఇరుకు రోడ్డులో కారు వేగంగా పోతోంది.. వెనుక పోలీసులు వెంబడిస్తున్నారు.. ఒకడు రోడ్డుపై వాహనాదారులను గుద్దుకుంటూ చాలా వేగంగా ముందుకెళ్తున్నాడు..ఇక ఆకారు వెనుక మరో స్కార్పియో వాహనంలో పోలీస్ .. కారులో వ్యక్తులను పట్టుకునేందుకు తుపాకి కాల్పులు.. అయినా కూడా ఆగకుండా ముందుకెళ్తోంది..ఆ కారు, ఇది చూసిన వారంతా కూడా ఇదేమైన సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే.. పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ లో జరిగిన రియల్ సీన్. రోడ్డుపై సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్ని కూడా రికార్డు అయ్యాయి. అయితే ఇంతకీ ఆ కారును పోలీసులు ఎందుకు వెంబడిస్తున్నారనుకుంటున్నారా..అసలు విషయం తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.ఇక మారుతి సుజుకి డిజైర్ కారులో ఇద్దరు వ్యక్తులు హెరాయిన్ ను తీసుకుని వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆకారులోని వ్యక్తులను పట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు. 


దీంతో ఆకారులోని వ్యక్తులు ఇరుకు రోడ్డులో చాలా వేగంగా వెళ్లిపోతుండగా వారిని పోలీసులు వెంబడించారు. ఒక చోట స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను కూడా కారుతో ఢీకొట్టి..ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఆసమయంలో వెనకాల వాహనంలో ఉన్న పోలీసు తుపాకితో కారు టైర్ పై కాల్పులను జరిపాడు. అయినా కూడా ఆగకుండా అక్కడి నుంచి మరికొంత దూరం కారులో ముందుకెళ్లిపోయాడు. కారు ముందు బంపర్లు వేలాడుతున్నా కూడా ఆగలేదు. ఆకారులో వ్యక్తిని పట్టుకునేందుకు ఓ పోలీస్ పరిగెత్తడం చూసిన వారంత కూడా ఆశ్చర్యపోయారు. చివరికి దుండుగుడు దొరకడంతో కారులో తనిఖీలు చేసిన పోలీసులు ఇక పది గ్రాముల హెరాయిన్ ని పట్టుకున్నారు. కారులో వున్న వ్యక్తులను పట్టుకున్నామని..అయితే వారి కోసం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆ పోలీసులు తెలిపారు.వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మనకు సినిమా సీన్ గుర్తొస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: