వరదల్లో చిక్కుకున్న కారు.. కుక్క చేసిన పనికి ప్రాణం పోయింది?

praveen
గత కొంతకాలం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఎన్నో రాష్ట్రాల్లో వరదలకు కారణం అయ్యాయి అనే విషయం తెలిసిందే. ఇక భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదలతో ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోకి వెళ్లి పోయాయ్. ఈ క్రమంలోనే ఎంతో మంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎన్నో వాహనాలు వరదల్లో చిక్కుకు పోయి ధ్వంసమవుతున్నాయి. అయితే కేవలం మనదేశంలోనే కాదు అగ్రరాజ్యమైన అమెరికా లో కూడా భారీ వర్షాలతో ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్నది తెలుస్తుంది.

 అమెరికాలో భారీ వర్షాల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇక అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు కూడా చేపడుతుంది. ఇక ఇటీవల అక్కడి వరదలు ఎంత బీభత్సం సృష్టిస్తున్నాయి అన్న దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే వరదల్లో ఒక ఎరుపు రంగు కారు చిక్కుకుపోయింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి ఆ కారులో ఉన్న వారిని రక్షించేందుకు సిద్ధమయ్యారు అనే చెప్పాలి.

 ఈ క్రమంలోనే ముందుగా ఆ కారు వరదలో కొట్టుకు పోకుండా ఉండేలా ఎర్రటి టేపు తో గట్టిగా ఆ కారును కప్పి ఉంచారు.. ఆ తర్వాత కారులో ఉన్న మహిళను డ్రైవర్ ను కూడా రక్షించి ఒడ్డుకు చేర్చారు పోలీసులు. అయితే కారులో ఎవరూ లేరని పోలీసులు అనుకున్నారు.. అంతలోనే ఆ కారులో నుంచి బయటపడిన మహిళ కారులో పెంపుడు కుక్క ఉంది అంటూ పోలీసులను అప్రమత్తం చేసింది. అయితే భయంతో కారులో కుక్క పిల్ల ఎక్కడో నక్కి ఉంది. దింతో వారికి కారులో కుక్కపిల్ల కనిపించకపోవడంతో ఇక దానిని రక్షించ లేక పోయారు. సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: