కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. గాడిద చేతిలో చావు దెబ్బలు?

praveen
ఇటీవల కాలంలో కొంతమంది మానవత్వం మరిచి మూగజీవాల విషయంలో దారుణంగా ప్రవర్తించటంతో లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.. ఏకంగా మూగజీవాలను కర్రలతో దారుణంగా చితకబాదడం లాంటివి చేయడం చేస్తూ ఉన్నారు. ఇక నొప్పి భరించలేక అటు మూగ జీవాలు కూడా అల్లాడిపోతూ ఉంటాయ్. ఇలా ఎంతో మంది ఇటీవల కాలంలో మూగజీవాల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తూ ఇక చిత్రహింసలకు గురి చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా ఎవరైనా తమ పై దాడి చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు మూగజీవాలు తిరగబడటం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఓ గాడిద ఇలాంటిదే చేసింది అని చెప్పాలి. సాధారణంగా గొడ్డు చాకిరికి గాడిద కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏ జంతువు చేయలేనంత చాకిరి గాడిద చేయగలదు. ఇక అలాంటి గాడిదను ఉపయోగించుకోవాల్సింది పోయి ఇక్కడ ఓ యువకుడు మాత్రం చావుదెబ్బలు కొట్టాడు. అయితే కాసేపటి వరకు దెబ్బలు తాళలేక అరుస్తూ విలవిలలాడి పోయింది ఆ గాడిద. కానీ దానికి సమయం వచ్చేసరికి మాత్రం ఆ యువకుడికి మంచి బుద్ధి చెప్పింది.

 ఎంత కొట్టినా గాడిద మనల్ని ఏమీ చేయలేదు అనే ఒక ఆలోచనతో ఉన్న ఆ యువకుడికి షాక్ ఇచ్చింది. నోటితో యువకుడి గాలిని గట్టిగా పట్టుకొని అతన్ని గింగిరాలు తిప్పేసింది   ఇక ఈ ఆసక్తికర వీడియోని ఈ సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ నటుడు శక్తికపూర్ పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఒక వ్యక్తి చేసిన తప్పుకు తక్షణ కర్మను ఎదుర్కొన్నాడు అంటూ ఒక కామెంట్ కూడా రాసుకొచ్చాడు బాలీవుడ్ నటుడు శక్తి కపూర్. ఇక ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు సైతం సదరు యువకుడికి తగిన శాస్తి జరిగింది అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: