వైరల్ : పెళ్లి మండపం పైనే.. వరుడిని దారుణంగా కొట్టిన వధువు?
సాధారణం గా పెళ్లి సమయంలో వధువు ఎంతో సైలెంట్ గా ఉండిపోతుంది... అందరూ ఏమనుకుంటారో అని కనీసం తల పైకెత్తడానికి కూడా ధైర్యం లేదు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది యువతులు వరుడు తో సమానంగా పెళ్లిని తెగ ఆస్వాదించడం వరుడి తో పోటీపడి ఒకరిపై ఒకరు తలంబ్రాలు వేసుకోవడం లాంటివి కూడా జరుగుతోంది.. ఇక మరికొన్ని వీడియోలో వరుడు వధువు పెళ్లి మండపంలో గొడవపడటం లాంటివి కూడా చేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. ఇక్కడ కూడా వధువు ఒక్కసారిగా రెచ్చిపోయింది.
పెళ్లి మండపం లో అందరి బంధువుల సమక్షంలో పెళ్ళి తంతు ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే పెళ్లి ఆచారం లో భాగంగా వరుడు తన చేతిని ముందుకు చాచేందుకు ప్రయత్నించాడు. కాని అనూహ్యంగా వధువు వరుడు పై దాడి చేసింది. అందరూ చూస్తుండగానే వారి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది అని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం అర్థం కాలేదు. తర్వాత వీరి గొడవను ఆపేందుకు అక్కడున్న బంధువులందరూ కూడా ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక వధూవరుల మధ్య ఎందుకు గొడవ జరిగింది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.