1000 కోట్ల విలువైన డైమండ్.. నెట్టింట వైరల్!

Purushottham Vinay
ఈ ప్రపంచంలో ఆఫ్రికాఖండం అంటేనే వజ్రాలకు నెలవు. అటువంటి ఆఫ్రికాలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం అనేది లభ్యమైంది.ఇక అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆస్ట్రేలియన్ సంస్థ లుపాకా డైమండ్ కంపెనీ ఈ డైమండ్ ను గుర్తించింది. ఈ వజ్రం ఇక అచ్చమైన లేత గులాబీ రంగులో మిలమిలా మెరిసిపోతూ కనిపిస్తోంది. ఈ వజ్రం మొత్తం 170 క్యారెట్ల బరువు ఉందని తెలిపింది లుపాకా డైమండ్ కంపెనీ.ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనని కూడా తెలిపింది. దేశంలోని వజ్రాలు అధికంగా ఉండే ఈశాన్య ప్రాంతంలోని లులో గనిలో ఈ వజ్రం అనేది లభ్యమైంది.ఇక సహజమైన వజ్రాల్లో అత్యంత స్వచ్ఛతతో..పూర్తిగా ఒకే రంగుతో ఉన్నవి అత్యంత అరుదుగా ఉంటాయని..అలాగే ఈ పింక్ డైమండ్ ఆ అరుదైన కేటగిరీలోకి వస్తుందని లుపాకా కంపెనీ ప్రకటించింది. ఈ వజ్రానికి 'లులో రోజ్' అని పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సానబెడితే..మొత్తం 85 నుంచి 90 క్యారెట్ల వరకు ఉండే ఒక పెద్ద పాలిష్డ్ వజ్రంగా రూపొందనుంది. ఈ ప్రక్రియలో మరిన్ని వజ్రాలు కూడా రూపొందుతాయని లుకాపా డైమండ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


అరుదైన పింక్ డైమండ్ ను త్వరలో వేలం వేస్తామని కూడా తెలిపిందా కంపెనీ. కానీ వజ్రం క్యారెట్లను బట్టి దాని ధరను నిర్ణయిస్తామని ఆ ధర ఎంత వస్తుందనేది ఇంకా అంచనా వేయలేదని..కానీ దీనికి అద్భుతమైన ధర వస్తుందని లూపాకా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.2017 వ సంవత్సరంలో అచ్చంగా ఇటువంటి స్వచ్ఛమైన డైమండ్ 'పింక్ స్టార్'ను హాంకాంగ్ లో వేలం వేశారు.మొత్తం 59.6 క్యారెట్ల బరువైన ఆ వజ్రానికి 71.2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.570 కోట్లు ధర పలికింది. కేవలం ఒక్క వజ్రానికి పలికిన అత్యధిక ధర విషయంలో అదే ప్రపంచంలో అత్యధిక విలువ కావడం అనేది గమనించాల్సిన విషయం. ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన పింక్ డైమండ్ అయిన 'లులో రోజ్' వచ్చేసి సుమారు 90 క్యారెట్ల వరకు ఉండనుందనే అంచనాతో 'పింక్ స్టార్' కన్నా భారీగా ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల దాకా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: