ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి..వాటిని చూస్తె ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటారు.ముఖ్యంగా జంతువులకు సంబందించిన కొన్ని వీడియోలు మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..రోజు వచ్చే వీడియోలు మాత్రం ఒక టైపు.. ఇప్పుడు చూసే వీడియో మాత్రం మరో లెవల్ అని చెప్పాలి.ఈ మధ్య కాలంలో ఫిట్ నెస్ కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు..ముఖ్యంగా జిమ్ లకు వెళ్ళి తెగ కష్ట పడుతున్నారు.ఇవే కాకుండా తెల్లవారుజామున నిద్రలేచి మార్నింగ్ వాక్, యోగా చేసేవారు చాలా మందే ఉన్నారు.
ప్రజలు ప్రతిరోజూ యోగా, వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకున్నారు. అయితే.. మంచి ఆరోగ్యంపై మనుషులకు మాత్రమే కాకుండా జంతువులకూ అప్రమత్తత ఉంటుంది. దీనిని నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిది. ఒక ఉడుత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఒక ఉడత తన చేతులు, కాళ్ళను సాగదీయడం చూడవచ్చు. కరోనా కాలంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు జంతువులపై కూడా కనిపిస్తోంది. ఉడుతలు ఇలా వ్యాయామం చేయడం చూసి నెటిజన్లు చాలా ఇంప్రెస్ అవుతున్నారు.
కొన్ని సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఉడత ఇలా వ్యాయామం చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వారి అభిప్రాయాలను కామెంట్లు గా ఇస్తున్నారు. 'ఇప్పుడు జంతువులు, పక్షుల నుంచి మానవులు చాలా నేర్చుకోవాలి', 'ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారు, ఈ వీడియోను తప్పక చూడండి' అని రాశారు. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి...మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ అయ్యింది..ఆ వీడియోను చూసి లైకో, కామెంట్ నో చెయ్యండి..