దేవుడిలా వచ్చాడు.. 5వ అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారిని?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో మారుమూల  జరిగిన ఘటనలు కూడా నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతున్నాయ్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో రకాల వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఇలా ఎలా చేయగలిగారు అంటూ నెటిజన్లు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ప్రమాదంలో ఉన్న సమయంలో పక్కనే ఉన్న మరికొంత మంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇక ప్రాణాలను కాపాడటం లాంటివి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. సాధారణంగా పిల్లలు ఆడుకునే సమయంలో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. అక్కడ పొంచి ఉండే ప్రమాదం గురించి  వారికి తెలియదు. కాబట్టి తెరిచి  ఉన్న కిటికీ నుంచి బయటకు చూడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కానీ ఆ భవనం కింద ఉన్న ఒక వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి హీరోల చిన్నారిని కాపాడాడు.

 ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ ఘటన చైనాలోని జింజియంన్ ప్రావిన్స్లో వెలుగులోకి వచ్చింది. టోన్గిజి యాంగ్ లో చోటుచేసుకుంది అనే చెప్పాలి.. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో టోన్గిజి యాంగ్ ప్రాంతంలో షేన్ డంగ్  అనే వ్యక్తి తన కారును పార్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే  రెండేళ్ల వయసున్న చిన్నారి 5వ అంతస్తు నుంచి కింద పడిపోతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించాడు శెంగ్ జాంగ్. అదే సమయంలో పెద్దగా కేకలు వినిపించడంతో ఇక పై నుండి పడిపోతున్న పిల్లాడిని పట్టుకునేందుకు అతను  వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చాడు.  ఎంతో సమయస్ఫూర్తితో పై నుంచి కింద పడిన చిన్నారి ని రెండు చేతులతో పట్టుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: