వైరల్ : అబ్బాయిని పొట్టు పొట్టుగా కొట్టిన అమ్మాయి?

praveen
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇందులో ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఒక యువకుడి కోసం నడిరోడ్డు మీద అందరూ చూస్తున్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి దారుణంగా కొట్టుకోవడం లాంటి వీడియోలు చూస్తూ ఉన్నాం. అదే సమయంలో అబ్బాయిలు కూడా చిన్న విషయాన్ని పెద్ద గా చేసుకుని గ్యాంగులు గా మారిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం లాంటివి కూడా సోషల్ మీడియాలో తెరమీదకు వస్తున్నాయి. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఫైటింగ్ వీడియో మాత్రం కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ఇక్కడ ఒక బార్ లో ఏకంగా ఒక అమ్మాయి యువకుడిని దారుణంగా కొట్టింది. పూల కుండి తో తల పగలగొట్టేందుకు ప్రయత్నించింది.

 ఇటీవలే ఎందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే అక్కడే ఉన్న స్థానికులు ఆ యువతిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఉగ్రరూపం దాల్చింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లోని సమ్మిట్ బిల్డింగ్ లో ఉన్న ఒక బార్ లో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అబ్బాయిని కొడుతూ యువతి రచ్చ చేసింది. ఇక అక్కడే ఉన్న మరో అమ్మాయి అదుపు చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె అస్సలు ఆగలేదు. ఇక బార్ బయటే ఉన్న బౌన్సర్లు  వెంటనే వచ్చి అమ్మాయిని ఆపి యువకుడిని పక్కనే ఉన్న రూమ్ లోకి పంపించారూ. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అంటున్నారు పోలీసులు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా యువకుడు, యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 ఇక ఇప్పటికే బార్ లో ఉన్న యాజమాన్యాన్ని, బౌన్సర్లను కూడా అక్కడ జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.. అక్కడ గొడవ జరగడానికి కారణం ఏంటి అన్న విషయంపై ఆరా తీస్తున్నారు అని చెప్పాలి. అయితే గతంలో కూడా ఈ బార్ లో ఇలాంటి గొడవలు జరిగాయి అన్నది తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం యువతి ఏకంగా యువకుడిపై దారుణంగా దాడి  చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది   అనే చెప్పాలి. యువతి కోపంతో ఊగిపోయిన తీరు చూసి నెటిజన్లు అందరు షాక్ లో మునిగి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: