నీ టాలెంట్ కు ఒక లైక్ వేసుకోవాల్సిందే..!!

Satvika
ప్రతి మనిషికి  ఏదొక టాలెంట్ ఉంటుంది.. కొంతమంది దానిని బయట పెట్టెందుకు ముందుకు వస్తే మరి కొంతమంది మాత్రం వెనకడుగు వేస్తున్నారు.. చేతులతో అద్భుతాల ను సృష్టిస్తున్నారు.. కొందరు రుచి కరమైన వంటలను వండితే.. మరి కొంతమంది మాత్రం చేతులతొ అద్భుతమైన కళాకాండను బయట పెడుతూ అబ్భురపరుస్తున్నారు. ఎన్నో అవార్డులను కూడా అందుకుంటారు.. మాములుగా ఎడమచేతి వాటం ఉన్నవారు తమ ఎడమ చేతితో రాయడం వంటి పనులను చేస్తారు. అలాగే కుడిచేతి వాటం వారు కుడిచేతితో వ్రాస్తారు..

కాగా,3 ఇడియట్స్ సినిమాలో బోమన్ ఇరానీ రెండు చేతులతో రాసే పాత్రను చూశారు గా. అది చూసిన వారికి నిజ జీవితంలో ఇది సాధ్యమేనా అని ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో రెండు చేతులతో రాసే సామర్థ్యం ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాయడం వరకు ఓకే ఇది అందరూ చేస్తారు.. కళ్ళతో చూడకుండా వెనక్కి తిరిగి బొమ్మలు వెయ్యడం చాలా కష్టం.. అందుకు చాలా నైపుణ్యం కావాలి..

వెనుకకు తిరిగి, బోర్డు వైపు చూడకుండా ఒకేసారి రెండు చేతులతో డ్రాయింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? అలాంటి అరుదైన నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఓ వ్యక్తి తన వీపును బోర్డుకి ఆనుకుని కుర్చీపై కూర్చుని రెండు చేతులతో శివాజీ, అతని ప్రత్యర్థి చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలు గీసేటప్పుడు ఒక్క తప్పు కూడా లేకుండా చక్కగా, తేలిగ్గా డ్రాయింగ్ గీయడం అద్భుతంగా పేర్కొనవచ్చు. హిందుస్థాన్ నౌ గ్లోబల్ ప్రెస్ దాన్ని షేర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. దీనికి 1.5 మిలియన్ల వ్యూస్, 1.49 లక్షల లైక్‌ల తో పాటు 2 వేలకు పైగా కామెంట్‌ లు వచ్చాయి... అతని టాలెంట్ కు ప్రతి ఒక్కరూ ఫిధా అవుతున్నారు.. మొత్తానికి అతను సెలెబ్రేటి అయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: