మెట్రోలో డ్యాన్స్ ఇరగదీసిన కుర్రది.. వైరల్..

Satvika
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటే మరి కొన్ని వీడియోలు మాత్రం జనాలను పిచ్చోళ్లను చేస్తున్నాయి. కావాలనే ఫెమస్ అవ్వాలనే మరీ దారుణంగా చేస్తున్నారు, ఇప్పుడు పబ్లిక్ లో డ్యాన్స్ చెయ్యడం ట్రెండ్ అవుతుంది. తాజాగా ఓ అమ్మాయి రైల్వే స్టేషన్ లో అదిరిపోయే డ్యాన్స్ చేసి అందరిని తన వైపు లాక్కుంది. తాజాగా మెట్రోలో డ్యాన్స్ చేసి అందరిని నోర్లు వెళ్ళబెట్టేలా చేసింది.
సోషల్ మీడియా వచ్చాక యువత ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతుంది. యువతీయువకులు రీల్స్, ఫ్రాంక్స్, టిక్ టాక్ అంటూ నిత్యం వీడియోలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫేమస్ అవుతున్నారు. అయితే,తాజాగా హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో ఓ యువతి చేసిన డాన్స్ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆ యువతి డాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లోని ఆ మెట్రో స్టేషన్‌ ఎక్కడో తెలియదుగానీ, యువతి మాత్రం తన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది.
అయితే,సదరు యువతికి సంబంధించిన మరో వీడియో కూడానెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సారి మెట్రో స్టేషన్‌ లోనే కాకుండా మెట్రో రైల్‌ లో కూడా యువతి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. జీన్స్, స్లీవ్ లెస్ టాప్ ధ‌రించిన యువ‌తి.. కన్నడ సినిమా విక్రాంత్ రోనా సినిమాలోని ‘రారా రక్కమ్మ.. రారా రక్కమ్మ’ అనే పాట‌కు స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో స్టెప్పులు వేసింది. మ‌రో పాట‌కు క‌దులుతున్న రైల్లోనే స్టెప్పులేసి అంద‌ర్నీ మైమ‌రిపించింది. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. అవి కాస్త వైరల్‌గా మారాయి.
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు. అయితే ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆ యువతికి సంబంధించిన మరో డ్యాన్స్‌ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా రన్నింగ్‌ ట్రైన్‌లోనే ఈ డ్యాన్స్‌ చేసింది సదరు యువతి. ఈ యువతి ఎవరో తెలియదు కానీ.. మోడ్రన్‌ డ్రెస్‌లో రన్నింగ్‌లో ఉన్న మెట్రో రైల్‌లో డ్యాన్స్ చేసింది. ఇక దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: