వైరల్ : కార్ డోర్ ప్రాణం తీసింది?

praveen
ఇటీవలి కాలంలో కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంతో చేసిన పనులు మరికొంతమంది పాలిట శాపంగా మారి పోతు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. చివరికి చిన్న పొరపాట్లే అమాయకుల ప్రాణాలను కూడా తీసేస్తూ ఉంటాయి అని చెప్పాలి. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇతరుల ప్రాణాలను ఇబ్బందుల్లో పెట్టేస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రమాదాలతో తమ ప్రాణాలను చేజేతులా తీసుకుంటూ ఉంటారు  ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది గాయాల బారిన పడుతూ ఉంటే ఇంకా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 కొంతమంది జీవచ్ఛవాలుగా మారిపోతూ జీవితాలు దుర్భరంగా మార్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రెప్పపాటు కాలంలో జరిగిన యాక్సిడెంట్ ప్రాణాలు పోయేలా చేసింది అని చెప్పాలి. ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. లక్నోలోని అలంబాగ్ ప్రాంతంలోనే చోట బరహ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. అనిల్ గౌతం అనే వ్యక్తి స్కూటీ మీద వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డు పక్కనే ఒక కారు పార్క్ చేసి ఉంది.

 ఈ క్రమంలోనే వెనక ముందు ఇతర వాహనాలు వస్తున్నాయా లేదా అన్న విషయాన్ని గమనించకుండా కారులో ఉన్న వ్యక్తి సడన్గా డోర్ తీసాడు. స్కూటీ మీద వెళ్తున్న అనిల్ కు ఒక్కసారిగా కార్ డోర్  తగిలింది. స్కూటీ మీదనుంచి ఒక్కసారిగా ఎగిరి కిందపడ్డాడు. హెల్మెట్ కూడా పక్కకు వెళ్లిపోయింది. వెంటనే అక్కడున్న వారు అతన్ని లేపడానికి ప్రయత్నించగా.. అపస్మారక స్థితి లోకి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఇక వెంటనే అతన్ని ఐసియులో చేర్పించి చికిత్సను అందించారు.  చివరికి చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: