వైరల్ : పాముతో ఆటలు.. చివరికి ఏం జరిగిందో చూడండి?

praveen
సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా సరే భయపడిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది పాములు పట్టుకోవడం ఏకంగా చేతుల్లో వాటిని ఆడించడం పాములతో  సరదాగా గడపడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వామ్మో పాములతో ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఎంతోమంది పాములను రెస్క్యూ చేయడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియా లో పెడుతూ ఉన్నారు.

 అయితే ఎంత సరదా ఉన్న పాములతో మితిమీరిన వేషాలు వేస్తే మాత్రం చివరికి మొదటికే మోసం వస్తుంది అన్న విషయం తెలిసిందే  ఇప్పటికే ఈ విషయం ఎంతో మంది విషయంలో నిరూపితమైంది. పాములతో ఆడుకోవాలని ప్రయత్నించి చివరికి అదే పాముకాటుకు గురై మరణించిన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. అతను పాము తో సరదాగా ఆడుకోవాలని ప్రయత్నిస్తే చివరికి అది ఒక ప్రమాదం గా మారిపోయిన చెప్పాలి.

 ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి రంగురంగులుగా కనిపించే ఒక సన్నటి పామును చేతిలో పట్టుకుని వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ పాము ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. కనురెప్పల పైన దాడి చేసి గట్టిగా పట్టుకుంది. అతను ఎంతలా వెనక్కి లాగడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఆ పాము విషపూరితమైనదా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ పాము విషపూరితమైనది అయితే అతను ప్రాణాలతో బయట పడాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: