గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఉండేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

Satvika
ప్రేమ ఎప్పుడూ ఎవరి మధ్య పుడుతుంది అనేది తెలుసుకోవడం కష్టం..ప్రేమకు వయస్సు లేదు, ఇంకా ప్రేమకు హద్దులు లేవు.ప్రేమకు లింగం తో సంబంధం కూడా లేదు..ప్రేమ ఒక మైకం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ గురించి చెప్పాలంటే రెండు రోజులు కూడా సరిపోవు.. రాయడానికి పుస్తకాలు సరిపోవు..ఈ మధ్య కాలంలో ఎక్కువగా లెస్బీయన్ ల ప్రేమ వెలుగు లోకి వస్తుంది.. వాళ్ళ ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడం తో గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పటికీ వుండటానికి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా సర్జరీ చెయించుకొని తన ప్రేమను గెలిపించుకుంది..

ఉత్తరప్రదేశ్‍ లోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన యువతి.. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బతకాలని లింగమార్పిడి చేయించుకుంది. లెస్బియన్లుగా ఉన్న వారి రిలేషన్‌షిప్‌కు ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉండటం తో ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొనేందుకు రెడీగా అయ్యారు. ఒకరితో ఒకరిని కలవ నీయకుండా కట్టడి చేయడం తో పరిష్కారం గురించి ఆలోచించారు.ఇరు కుటుంబ సభ్యులు ఎంత చెప్పిన వాళ్ళు వినలేదు. దాంతో ఒకరి తో మరొకరిని కలవనివ్వకుండా చేశారు.

ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌ లో డాక్టర్ల టీం సర్జరీ నిర్వహించారు. ఛాతీతో పాటు ఇతర శరీర భాగాల ను మార్చే ప్రయత్నం చేశారు. అదే సమయం లో సర్జరీ పూర్తి కావడాని కి 1.5 సంవత్సరాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆ మహిళకు టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేశారు. ఫలితంగా చాతిపై వెంట్రుకలు పెరుగుతాయని వైద్యులు వెల్లడించారు. ఈలింగ మార్పిడి తర్వాత మహిళ గర్భం దాల్చడం వంటి అవకాశాలు కోల్పోయింది. ఇటువంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 18నెలల సమయం పడుతుంది. ఆమెకు పూర్తి వైద్య పరీక్షలు జరిపారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: