కేవలం పెప్సీలు మాత్రమే తాగుతున్న వ్యక్తి.. చివరికి..

Satvika
చాలా మంది ఇష్టమైన వాటిని తినాలని అనుకుంటారు.. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అందులో కొంతమంది ఆహారం విషయంలో శ్రద్ద తీసుకుంటే, మరి కొంతమంది మాత్రం ఇష్ట మైన ఆహారాన్ని వదలకుండా తీసుకుంటారు. ఓ వ్యక్తి ఇసుకను తిని అందరినీ ఆశ్చర్య పరిఛాడు.. ఇప్పుడు మరో వ్యక్తి రోజుకు 30 పెప్సీ బాటిల్స్ తాగుతున్నాడు. అన్నీ తాగితే అతని ఆరోగ్యం బాగుందా..బ్రతికున్నాడా అనే డౌట్స్ రావడం కామన్.. మీరు విన్నది నిజమే..అతను అన్ని తాగినా కూడా బాగానే ఉన్నాడు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అతను రోజుకు సుమారు 30 బాటిళ్ల పెప్సీ తాగుతాడు.. గత 20 ఏళ్లుగా అతను మంచినీళ్లు తీసుకోకుండా పెప్సీ మాత్రమే తాగుతున్నాడు.. పెప్సీ కోసం రోజుకు సుమారు రూ.1900 ఖర్చు పెడుతుంటాడు.. గత 20 ఏళ్లుగా కేవలం పెప్సీ కోసమే ఏడాదికి రూ.6.7 లక్షల ఖర్చు పెడుతున్నాడు.

నిద్ర లేచిన వెంటనే ఆండీ ఒక గ్లాసు పెప్సీ తాగిన తర్వాతే మిగిలిన పనులు పూర్తి చేస్తాడు. అలాగే పెప్సీ తాగిన తర్వాతే నిద్రపోతాడు. మధ్యలో దాహం వేసినపుడు కూడా పెప్సీనే తాగుతాడు. ఇలా గత 20 ఏళ్ల లో అతను ఏకంగా 219,000 బాటిళ్ల పెప్సీ తాగేశాడు. మోతాదుకు మించి పెప్సీ తీసుకోవడం వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింది. బరువు విపరీతంగా పెరిగిపోయింది.


దీంతో అతను ఆన్లైన్ హిప్నోథెరపీ క్లాస్కు హాజరై తన పెప్సీ అడిక్షన్ను తగ్గించుకుంటున్నాడు.. నైట్ షిఫ్ట్ కారణంగా ఆ అలవాటు అయినట్లు చెప్పుకోచ్చాడు.. ఏది ఏమైనా కూడా 20 ఏళ్ల తర్వాత అతడు మొదటి సారి మంచి నీళ్లను తాగాడు. ఈ పెప్సీ అలవాటు వల్ల నా బరువు 120 కిలోలకు చేరింది..ఇప్పుడిప్పుడే ఆ అలవాటుకు దూరం అవుతున్నట్లు చెప్పాడు.. ఇలా ఎవ్వరూ అలవాటు చేసుకొవద్దని చెబుతున్నాడు.. మొత్తానికి అతనికి జ్ఞానోదయమైంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: