51 ఏళ్ల తర్వాత లైబ్రరి బుక్ ను తిరిగిచ్చిన వ్యక్తి..ఆ తర్వాత..

Satvika
లైబ్రరీలో కొన్ని పుస్తకాలను మనం తీసుకున్నా కూడా వాటిని ఓ నెల లోపు మళ్ళీ తిరిగి ఇస్తాము..కానీ, కొన్ని కొంతమంది మాత్రం ఇవ్వకుండా చెక్కెస్తారు.. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ చదువుకోవాలన్నా, ఏదైనా సరికొత్త విషయాలు తెలుసుకోవాలన్నా.. పాఠశాలలు, కళాశాలల లైబ్రరీలను ఆశ్రయించాల్సిందే. అక్కడ నుంచి చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చుకునేవారు.. ఈ విషయం అప్పటి రోజులు కొంతమందికి గుర్తుండే ఉండాలి. ఆ సమయంలో.. లైబ్రెరీనుంచి పుస్తకం తెచ్చుకుంటే.. పుస్తకాన్ని గడువు తేదీకి ముందే తిరిగి ఇచ్చేలా జాగ్రత్త వహించాలి..


అలా చేయకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చేది. అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు పుస్తకాన్ని తిరిగి ఇవ్వాల్సిన తమ గడువు తేదీని మరచిపోయెవారు. అనంతరం లైబ్రెరీకి వెళ్లి.. బాగా తిట్లు వినవలసి వచ్చింది. మరి అలాంటిది ఒక పుస్తకాన్ని లైబ్రెరీ నుంచి తెచ్చి.. మరచిపోయి.. తిరిగి 51 సంవత్సరాల తర్వాత పుస్తకాన్ని తిరిగి ఇస్తే ఆ వ్యక్తికి ఎంత జరిమానా విధించాలి ఒకసారి ఆలోచించండి..వామ్మో ఊహించలేము కదా..


బ్రిటీష్ కొలంబియా లోని లైబ్రరీ నుండి అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. 1971లో ఒక వ్యక్తి తన పేరు మీద పుస్తకాన్ని లైబ్రెరీ నుంచి తీసుకున్నాడు.. ఇప్పుడు ఐదు దశాబ్దాల తర్వాత పుస్తకం తిరిగి లైబ్రరీ కి రిటర్న్ ఇచ్చాడు. పుస్తకాన్ని తిరిగిచ్చిన వ్యక్తి అందులో చిన్న నోట్ రాసి ఆలస్యానికి క్షమాపణలు చెప్పాడు. ఆ తరువాత పుస్తకం అందుకున్న వ్యక్తి కోపం అంతా పోయింది. గడువు తేదీ లోపులో అతను పుస్తకాన్ని తిరిగి ఇవ్వలేకపోయాడంటే.. అతనికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అర్ధం చేసుకోవచ్చు. ఆ వ్యక్తికీ వ్యక్తిగతంగా ఏర్పడిన ఇబ్బందుల వలన కాలపరిమితి లోపు పుస్తకం వంటి వాటిని తిరిగి ఇవ్వలేకపోయాడు.. అతను పెట్టిన షరతు వల్ల ఆ లైబ్రరీయన్ కరిగిపోయి అతనికి ఫైన్ వెయ్యలేదు..ఏదైనా నిజాయితీ ఉండాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: