అమెరికాలో ఏలియన్? సోషల్ మీడియాలో వైరల్!

Purushottham Vinay
ఇక టెక్నాలజీ వినియోగంలో అగ్ర రాజ్యం అయిన అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంది. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ దేశాల్లో ఎవరికీ అందనంత ఎత్తుకు అమెరికా చేరుకుంది. అలాంటి దేశంలో ఓ ఏలియన్‌ను పోలిన వింత జీవి సంచారం అక్కడి ప్రజలకు అసలు నిద్ర లేకుండా చేస్తోంది.ఇక టెక్సాస్‌లోని జంతుప్రదర్శనశాల వెలుపల దాగి ఉన్న వింత అనిశ్చిత జీవి చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.ఈ ఫోటో ఇంటర్నెట్‌ను బాగా ఊపేస్తోంది. అక్కడ సమీపంలోని సీసీ కెమెరా ద్వారా ఈ వింత జీవి చిత్రాలు అనేవి బయటకు వచ్చాయి.ఇక అక్కడ జూలో ఆ జీవి తిరుగుతున్నట్లు కనపడింది. దానికి రెండు చెవులు ఉన్నాయని ఇంకా అది రెండు కాళ్లతో నడుస్తోందని ఆ వీడియో చూసిన వారికి స్పష్టంగా తెలుస్తోంది.టెక్సాస్‌లోని అమరిల్లో నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వింత జీవికి సంబంధించిన ఫొటో ని పోస్ట్ చేశారు. మే 21వ తేదీన తెల్లవారుజామున జూ వెలుపల ఈ ఏలియన్ లాంటి వింత జీవి సంచరించింది.


ఇక అదేమిటో తెలిస్తే చెప్పాలని ఆ పోస్ట్ కోరింది. అయితే ఈ సమయంలో ఎటువంటి వ్యక్తులు లేదా జంతువులకు హాని జరగలేదని పార్క్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేదా ఏ విధమైన నేర కార్యకలాపాలు కూడా లేవని తేలింది. ఇక సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. ఈ చిత్రం మే 21, తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో అది సంచరించిందని తెలిసింది. అక్కడి జూ అధికారులు ఈ సంఘటనపై ప్రజల అభిప్రాయాన్ని కూడా కోరారు. ఏదైనా తెలిస్తే వెంటనే మెయిల్ చేయాలని కూడా కోరారు. ఇక ఏదేమైనా కానీ ఈ చిత్రం బయటకు రాగానే అది ఏలియన్ అయి ఉంటుందనే ఊహాగానాలు కూడా చుట్టు ముట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: