స్టేడియంలో యువతి అర్ధనగ్న ప్రదర్శన.. చివరికి బయటికి గెంటేశారు?

praveen
సాధారణంగా మైదానంలోకి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులు కొంత మంది కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రేక్షకుల ప్రదర్శించే అత్యుత్సాహం కొన్ని కొన్ని సార్లు మిగితా ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కాస్త అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉండాలి అని భావిస్తూ ఉంటారు కొంతమంది ప్రేక్షకులు. ఇక ఇలాంటి తరహా వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 బేస్ బాల్ మ్యాచ్ సందర్భం గా ఒక యువతి చేసిన పని సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారి పోయింది. ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అనే చెప్పాలి. స్టేడియం లో అందరూ చూస్తున్నారు అనే విషయాన్ని మరిచి పోయిన ఒక యువతి ఫుల్లుగా మద్యం తాగి అందరి ముందే  అర్ధనగ్న ప్రదర్శన తో రెచ్చి పోయింది. ఇక కనీసం తాను ఎక్కడ ఉన్నాను అనే సోయి కూడా లేకుండా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా డాన్స్ చేసింది. దీంతో యువతి తీరుతో మిగతా ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి.

 గమనించిన స్టేడియం సిబ్బంది మితిమీరి  ప్రవర్తించ వద్దు అంటూ మొదట యువతిని హెచ్చరించారు. ఇక వారి హెచ్చరికలను బేఖాతరు చేసిన యువతి మరింత రెచ్చిపోయింది. దీంతో కుదురుగా కూర్చోవాలని మరోసారి హెచ్చరించారు సిబ్బంది. లేదంటే స్టేడియం నుంచి వెళ్లిపోవాలంటూ సూచించారు. ఎంత చెప్పిన యువతి మాత్రం వినకపోవడంతో చివరికి స్టేడియం సిబ్బంది ఆమెను స్టేడియం బయటికి పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. లాస్ఏంజిల్స్ వేదికగా జరిగిన బేస్బాల్ మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: