వైరల్ : బుడ్డోడు చేసిన పని.. అందరి మనసును హత్తుకుంటుంది?

praveen
చిన్న పిల్లలు దేవుడితో సమానం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనుషుల్లో కనిపించే కుళ్లు కుతంత్రాలు స్వార్థం చిన్నపిల్లల్లో ఎక్కడా కనిపించవు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే  చిన్న పిల్లలు ఏ పని చేసినా కూడా అది ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నపిల్లలు మనుషులనే కాదు జంతువులను కూడా సమానంగా చూస్తారు అని చెప్పాలి. జంతువులతో ఎంతో సరదాగా ఆడుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారూ. ఇక ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎన్నో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బుడ్డోడు పొలంలో తన తండ్రితో పాటు వచ్చాడు. అక్కడ ఒక గొర్రె పిల్ల అరవడం వినిపించింది. దీంతో గొర్రే పిల్ల దగ్గరికి వెళ్ళాడు. అయితే తన తల్లి కనిపించకపోవడం కారణంగానే ఆ గొర్రె పిల్ల తల్లి కోసం అరుస్తుంది అనే విషయాన్ని గ్రహించాడు. అదే సమయంలో మరో వైపు నుంచి తల్లి గొర్రె కూడా తప్పిపోయిన బిడ్డ కోసం వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే  ఎంతో తెలివిగా ప్రవర్తించాడు ఆ బుడ్డోడు. వెంటనే గొర్రే పిల్లను తరలివస్తున్న వైపు వెళ్లేలా చేశాడు.  కాసేపటికి ఇక తల్లి బిడ్డ గొర్రెలు కలుసుకున్నాయి. ఇక ఈ వీడియో వైరల్ గా మారగా బుడ్డోడు తెలివికి అందరూ ఫిదా అవుతున్నారు.

 అయితే ఇలా తల్లి పిల్ల గొర్రెలు కలుసుకున్న తర్వాత ఆ బుడ్డోడు ఎంతగానో సంబరపడిపోయాడు. ఆ గొర్రెలు అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ బుడ్డోడు మాత్రం అక్కడే నిలబడి ఆ గొర్రెలను చూస్తూ ఉండి పోయాడు. ఇక ఈ ఎమోషనల్ వీడియో ఎంతో మంది హృదయాలను తాకుతుంది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి మానవత్వం నేటి రోజుల్లో మనుషుల్లో ఎక్కడా కనిపించడం లేదు అని కామెంట్లు చేస్తూ ఉన్నారు నెటిజన్లు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: