చేపలు వలలో వింత శబ్దాలు.. ఏంటా అని తెరిచి చూస్తే?

praveen
సాధారణంగా జాలరులు చేపలు పట్టేందుకు ఎప్పుడూ వల విసురుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వల విసిరి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు జాలర్లకు అరుదైన చేపలు దొరకడం  జరుగుతూ ఉంటుందో అలాగే కొన్ని కొన్ని సార్లు వరకు పెద్ద పెద్ద పాములు వలలో పడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని తెలుస్తుంది. ఒక జాలరి వల వేసి దానిని గట్టుకు తీసుకొచ్చాడు. ఇక వల బరువు గా ఉండడంతో చేపలు బాగానే పడ్డాయి అని అనుకున్నాడు. తర్వాత ఆ వల నుంచి వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. దీంతో ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు.

 మెల్లగా వల తెరచి చూసి ఒక్క సారిగా షాక్ లో మునిగిపోయాడు. ఎందుకంటే ఆ వలలో చిక్కుకుంది చేపలు కాదు ఏకంగా కింగ్ కోబ్రా. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యడు సదరు జాలరి. ఇక ఆ తర్వాత మాత్రం అతను అక్కడి నుంచి వెళ్లిపోకుండా ఏకంగా ఆ పాముకు నీళ్లు తాగించాడు. దీనికి సంబంధించిన  వీడియో కాస్త ప్రస్తుతం నెట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. సాధారణంగా కింగ్ కోబ్రా ఎక్కడైనా కనిపించింది అంటే చాలు అందరూ భయపడి పోయి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు.

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా కింగ్ కోబ్రా కి నీళ్ళు తాగించి దాహం తీర్చాడు. చేపల వల లో చిక్కుకుని బయటకి రాలేక నానా తంటాలు పడుతున్న కింగ్ కోబ్రా ని గమనించిన వ్యక్తి ఎంతో ధైర్యంగా చేపల వల ను కట్ చేసి ఆ పామును రక్షించాడు.  ఆ తర్వాత ఆ కింగ్ కోబ్రా ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఈ వీడియోని ఒడిషాలో షూట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎంతో ధైర్యంగా కింగ్ కోబ్రా కి నీళ్ళు తాగించటమే కాదు ఆ పాముని సురక్షిత ప్రాంతంలో వదిలేసిన వ్యక్తిపై ఎంతో మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: