Viral : వామ్మో! ఈ కాయ ధర ఒక్కోటి లక్ష రూపాయలా?

Purushottham Vinay
ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్ల రసాలు కమ్మగా కనువిందు చేస్తాయి. వేసవి కాలంలో అత్యధికంగా లభించే సీజనల్ పండు మామిడి కాయ. ఏపీలో అయితే మామిడి పండ్లు పరక లేదా డజన్ల రూపంలో అమ్మకాలు సాగుతుంటాయి.పరక అయినా డజను అయినా గరిష్టంగా ఓ వెయ్యిరూపాయలు నుంచి రెండు వేల వరకు గరిష్ట ధర అనేది పలుకుతుంది. ఇక అంతకు మించి అయితే నూజివీడు ఎక్స్ పోర్ట్ క్వాలిటీ మామిడి పండ్లు ఇంకాస్త ఎక్కువగా కూడా ఉంటాయి. కానీ ఏకంగా ఒక్కో మామిడి పండూ లక్షరూపాయలు పలకడం ఎక్కడైనా చూశామా అంటే లేదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది.కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఓ రైతు అయితే ఇంత భారీ రేటు పలికే మామిడి పండ్లను సాగుచేస్తున్నాడు. జపాన్ దేశానికి చెందిన 'మియాజాకీ' అనే జాతికి చెందిన మామిడిపండ్లు మన దేశంలో ఎన్నో లక్షల రూపాయల్లో ధర పలుకుతోంది. దీంతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు కూడా తనకు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఈ మియాజాకీ జాతికి చెందిన మామిడిపండ్లని పండిస్తున్నారు.


ఇక ఈ మామిడి విత్తనాన్ని జపాన్ దేశంనుండి తీసుకొచ్చినట్లు రైతు ఓదూరి నాగేశ్వరరావు తెలిపారు.ఇక ఈ సీజన్ లో పంట చేతికి కూడా వచ్చిందని, ఇంకా ఈ మియాజాకీ రకం మామిడిపండులో పోషకవిలువలు చాలా అధికంగా ఉంటాయని అలాగే ఒక్కో పండు మూడునుంచి నాలుగొందల గ్రాముల బరువు ఉంటుందని, అందుకే ఈ మధురఫలానికి ప్రంపంచ మార్కెట్లో కిలో రెండున్నర లక్షల రూపాయల దాకా మంచి ధర ఉందని నాగేశ్వరరావు తెలిపారు. ఇక ఇవే కాకుండా తమకు ఉన్న నాలుగెకరాల పొలంలో ప్రపంచంలో ఉన్న వివిధరకాల మామిడిపండ్లను తాను ఇంకా అలాగే తన కుమారుడు కిశోర్ కలిసి, స్వయంగా పండిస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: