ఈ కోడి మందులేకుండా సెకను కూడా ఉండదట..ఓర్నీ..

Satvika
కళ్ళు తాగిన కోతి అని వినే ఉంటాము.. కానీ మందు తాగిన కోడి అని మాత్రం ఎప్పుడూ వినలేదు..ఇప్పుడు ఈ వార్త కూడా ఇప్పుడు వినాల్సి వచ్చింది. అవును అండీ మీరు విన్నది అక్షరాల నిజం..ఓ కోడి మందు లేనిది ఉండ లేదట..అసలు ఆ కోడి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము..

 
మహారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు రాజభోగాన్ని అనుభవిస్తుంది. ఆ కోడి పుంజుకు ప్రతిరోజూ మందు ఉండాల్సిందే. మందు లేనిదే ముద్దకూడా ముట్టధు.. ఆఖరికి మంచినీళ్లు కూడా తాగదు. ప్రాణమైనా పోగొట్టుకునేందుకు సిద్ధమవుతుంది.. కానీ మందు లేకుంటే బతకలేదు. ఇలాంటి అరుదైన ప్రవర్తన కలిగిన వారు మనుషుల్లో కనిపిస్తారు. కానీ కోడిపుంజు సైతం నేను మనిషికంటే ఏం తక్కువ తిన్నానా అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఇంట్లో కోడిపుంజులా పెంచుకుంటున్న యాజమాని చేసేది లేక దానిని బతికించుకొనేందుకు రోజూ మద్యం తెచ్చి పోస్తున్నాడు..


అసలు ఆ కోడి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకుందాం.. కోడిపుంజు యాజమానికి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఓ రోజు కోడి పుంజుకు ఆహారాన్ని అందించాడు. అయితే అది ముట్టుకోలేదు. రోజంతా అలానే ఉంది. మంచినీరు పెట్టినా తాగలేదు. దీంతో మరుసటి రోజు కోడిపుంజు కు మద్యాన్ని అందించే సరికి గటగటా తాగేసి వెంటనే ఆహారాన్ని తీసుకుంది. ఖంగుతిన్న యాజమాని.. మద్యానికి బానిసైందని గుర్తించాడు. కోడిపుంజుకోసమని ప్రత్యేకంగా మందు తెప్పించి ప్రతిరోజూ కొంచెం పోసి దానికి ఆహారం అందిస్తున్నాడు.


ఈ విచిత్ర ఘటన చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. అయితే కోడి పుంజుకు కేవలం మద్యం అందించేందుకు యాజమానికి నెలకు రూ.2 వేలు ఖర్చు అవుతుంది. ఖర్చు భరించలేని భావుకాతోరే పశువైద్యాధికారిని సంప్రదించాడు.. అయితే ఆ కోడికి డాక్టర్ ఆ వాసన వచ్చే మాత్రలను ఇచ్చారు.అలా ఇప్పుడు అలవాటు చేశారు.. మొత్తానికి ఇప్పుడు కోడి మద్యం అలవాటు నుంచి బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: