పోలీసు మంచి మనసుకు ఫిదా అవుతున్న నెటిజన్స్..

Satvika
పోలీసులు అంటే ఎప్పుడూ కోపంగా, చూడటానికి భయంకరంగా ఉంటారని చాలామంది అనుకుంటారు.. అలా కేవలం క్రిమినల్స్ ను పట్టుకోవడం కోసం మాత్రమే ఉంటారు. భయంకరమైన ఖాకీ యూనిఫామ్ వెనుక వెన్న వంటి మనసు కూడా ఉంటుందని అంటున్నారు.. చాలా మంది పోలీసులు నిరూపించారు కూడ..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది... ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పెద్ద మనసును ఛాటుకున్నాడు.. పిల్లల దృష్టి లో రియల్ హీరో అయ్యాడు.నెత్తి మీద సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా.. విధి నిర్వహణలో మునిగి ఉన్నాడు. అంతలోనే ఇద్దరు చిన్నారులు రోడ్డుపై కంట పడ్డారు.


రోడ్లపై చెత్త ఏరుకునే చిన్నారులు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా వారిలో ఒక చిన్నారి కాళ్లకు చెప్పులు లేకపోవడంతో కాళ్లు మండిపోతున్నాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ రంజిత్ సింగ్ దగ్గరకు వెళ్లి రోడ్డు దాటించేందుకు సహాయం చేయాలని కోరారు. అప్పటికే సిగ్నల్ ఆన్ కావడంతో కొంచెం సేపు ఆగమని చెప్పారు రంజిత్. 'త్వరగా రోడ్డు దాటించండి సర్‌.. కాళ్లు మండిపోతున్నాయ్' అని చెప్పడంతో రంజిత్‌ సింగ్‌ ఆ చిన్నారిని తన పాదాలపై నిలబడమని చెప్పాడు. కానిస్టేబుల్ చెప్పినట్టుగానే ఎండ వేడిని తట్టుకోలేక చిన్నారి కానిస్టేబుల్ పాదాలపై నిలబడ్డాడు. ఆ తర్వాత రెడ్ సిగ్నల్ పడగానే వారిద్దని అవతలికి దాటించాడు.

 
అక్కడే ట్రాఫిక్‌లో ఉన్న కొంత మంది ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రంజిత్ సింగ్.. ఆ చిన్నారి తన పాదలపై కాళ్లు పెట్టినప్పుడు,దేవుడే తనపై కాలు మోపినట్టు అనిపించింది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.. రోడ్డు దాటించిన అనంతరం వారికి చెప్పులు, బట్టలు కొని పంపించాడు. రంజిత్ సింగ్‌ చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. గతంలోనూ రంజిత్‌ సింగ్ డాన్సింగ్‌ కానిస్టేబుల్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు..ఇప్పుడు కూడా వైరల్ అయ్యాడు..మొత్తానికి రియల్ హీరో అయ్యాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: