పెంపుడు చిలక కోసం భారీ ఆఫర్..పోస్టర్ వైరల్..
ఏకంగా పోస్టర్ ప్రింట్ చేయించి గోడలకు అంటించాడు. ఆ పోస్టర్ లో తన చిలక ఫోటోను వేశాడు. మేము ఎంతో ముద్దుగా సాకుథున్న చిలక దొరికితే చెబితే 5100 రివార్దును కూడా ఇస్తామని తెలిపారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..అంతేకాదు ఫేస్ బుక్, వాట్సాప్ ల్లో కూడా ప్రకటించారు. మా పెంపుడు రామచిలుకను పట్టి తెచ్చిస్తే రూ.5,100లు బహుమతిగా ఇస్తాం అంటూ ప్రకటిస్తోంది బీహార్ లోని గయకు చెందిన శ్యామ్‌దేవ్ ప్రసాద్ కుటుంబం. మా చిలుకమ్మను తెచ్చిస్తే రూ.5,100లు బహుమతి అంటూ ఊరంతా పోస్టర్లు వేసి మరీ ప్రకటించారు..
గయాలో పిపర్పతి రోడ్డులో ఉంటున్న శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్తా, సంగీత గుప్తాలు ఓ చిలుకను పెంచుకున్నారు. వాళ్లు పెంచుకునే చిలుక ఈ మధ్య ఇంట్లోంచి ఎగిరిపోయిందట. దాని కోసం వెదకని చోటు లేదు. చిలుకమ్మ కోసం తిండి నిద్ర మాని మరీ వెదికారు. అయినా దొరకలేదు.ఆ చిలుక ఉన్న పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో, మార్కెట్లలో వేశారు.12ఏళ్లుగా చిలుకను పెంచుకుంటున్నామని, ఏప్రిల్ 5న ఇంట్లోంచి వెళ్లిపోయిందని శ్యామ్ ప్రసాద్ దంపతులు చెబుతున్నారు. మా చిలుకమ్మను ఎవరు తీసుకెళ్లారో, వారికి ఇంకో చిలుక కొనిస్తాము మాకు ఇవ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిలుక దొరుకుతుందో లేదో చూడాలి..