ఇలాంటి ఆచారాలు నెవ్వర్ బీఫొర్.. ఎవ్వర్ ఆఫ్టర్..
విషయాన్నికొస్తే.. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురులాగా చీర, నగలు, డ్రెస్ వేసుకొని పూజలు చేయడం అనెది అందరినీ ఆశ్చర్యంలో ముంచెసింది.. అందుకు సంభంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇది నిజంగా ఆలొచించాల్సిన విషయం అనే చెప్పాలి.. అమ్మాయి అబ్బాయిగా మారడం పై కొందరు విమర్శలు కురిపిస్తున్నారు.. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని
కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్రబాబుకు ఈ ఆదివారం ఘనంగా వివాహం జరిగింది..అయితే వివాహానికి ముందు ఒక వింత ఆచారం కూడా వాళ్ళకు ఉందని చెబుథున్నారు.
పెళ్లి కుమారుడు తమ వంశాచారం ప్రకారం ప్యాంటు, చొక్కాలకు బదులుగా చీర, జాకెట్ ధరించి బారెడు విగ్గు, తలనిండా పూలు పెట్టుకున్నాడు. బొట్టూ, కాటుక, గాజులు, దండలతో అచ్చం పెళ్లి కుమార్తెలా ముస్తాబయ్యాడు. వంశాచారం ప్రకారం పెళ్లి ముందు దేవుడికి ఎదురు నడవాలని అంటున్నారు. అప్పుడే వారి సంసారం సుఖంగా వుంటుందని వారి నమ్మకం..తమ ఇలవేల్పు అయిన గురప్పడు స్వామికి కొలుపులు జరిపేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మేళతాళాలు, బొల్లావుతో ఉత్సవం చేసుకుంటూ ఎదురైన ముత్తయిదువులకు నుదుట బొట్టు పెట్టుకుంటూ వారి ఆశీర్వచనాలు అందుకున్నాడు. అలా ఊరి చివర వున్న జమ్మి చెట్టుకు నైవెద్యం పెట్టి పూజలు చేసి అనంతరం పెళ్ళి తంతు మొదలు పెడతారు.. ఈ ఆచారం ఏమో గానీ అతడి పరువు సోషల్ మీడియాలో పోయా..