తాత అదిరిపోయే స్టెప్పులు.. డాన్స్ చూస్తే అవాక్కే?

praveen
సాధారణంగా ఏదైనా ఫంక్షన్ జరిగింది అంతే చాలు ఎంతోమంది డీజే పాటలు పట్టుకొని ఎంతో సంతోషంగా డాన్సు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలా ఎక్కువగా డీజే పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసేది మాత్రం యువత అని అంటూ ఉంటారు. కానీ ఎంజాయ్ చేయడానికి వయసుతో పని ఏముంది అని కొంతమంది నిరూపిస్తూ ఉంటారు. యువత తో పోటీ పడుతూ వృద్ధులు సైతం కొన్ని కొన్ని సార్లు డాన్స్ చేసే వీడియోలు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  యువకులతో పోటీపడుతూ వృద్దులు చేసే డాన్స్ చూసి ఎంతో మంది షాక్ అవుతూ ఉంటారు.

 ఇక్కడ ఇలాంటి ఒక డాన్స్ వీడియో ని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. సాధారణంగా సినిమా పాటలు పెట్టినప్పుడు  యువకులు ఆ పాటకు తగ్గట్టుగా డాన్స్ చేయడం లాంటివి చూస్తూ ఉంటారు. వృద్ధులు డాన్స్ చేసినప్పటికీ తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వృద్ధుడు మాత్రం పక్కన ఉన్న యువకులు అందరూ కూడా అవాక్కయ్యే విధంగా డాన్సులు చేసి అదరగొట్టాడు. ఆ తాత డాన్స్ చూసి ప్రతి ఒక్కరూ పక్కకు తప్పుకున్నారు అంటే ఆ తాతను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు అంటే ఆ తాత ఏ రేంజ్ లో డాన్సులు చేశారో అర్థం చేసుకోవచ్చు.

 ఎంజాయ్ చేయడానికి వయసు ఎక్కడ అడ్డు రాదు అని ఈ తాత నిరూపించారు. జై చిరంజీవ సినిమా లోనుంచి తెగ ముద్దోచ్చేస్తున్నావే అనే పాటకు డాన్స్ చేసిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో  చెక్కర్లు కొడుతుంది.. తాత ఎంతో హుషారైన స్టెప్పులు వేయడమే కాదు పాటకు తగ్గట్టుగా స్టెప్పులు మారుస్తూ ఉండటంతో ఇక ఈ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఏజ్ లో కూడా ఇంత  స్టామినా ఎటు నుంచి వచ్చింది తాత అని కొంతమంది అంటున్నారు. మెగాస్టార్ పాట అన్న తర్వాత ఎవరైనా స్టెప్ వేయాల్సిందే అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: