ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ఎలా బోల్తాపడిందో చూడండి?
వెరసి ఇలా ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోతున్న పరిస్థితులు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అతివేగం ఎంత ప్రమాదకరమో ఇక ఈ వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ఇక రోడ్డుపై అతివేగంగా వస్తున్న సమయంలో ఏదైనా వాహనం అడ్డుగా వస్తే ఇప్పుడు దానిని తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
పూణే అహ్మద్నగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను దాటి ఒక కార్ ప్రైవేటు పాసింజర్ బస్సుకు ఎదురుగా వెళ్ళింది. అయితే దాన్ని తప్పించే క్రమంలో వేగంగా ఉన్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా ఇక బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి అని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే సమీపంలో ఉన్న సిసిటివి ఫుటేజీలో రికార్డైన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.