"పెట్రోల్ కంటే... బీర్ చీప్"... తాగండి కానీ ?
పెరిగిన ఈ ధరలపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్, సెటైర్లు మరియు ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో అన్నివైపులా నుండి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒక మహిళ ఈ ధరల పెంపుపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక అమ్మాయి వెరైటీగా పెట్రోల్ కన్నా బీర్ చాలా చీప్ అన్న ఫ్లకార్డ్ పట్టుకుని తాగండి, కానీ బండ్లు నడపకండి అంటూ పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. దాంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
ఈ వార్త విన్న వారంతా నిజమే కదా పెట్రోల్ ధరలతో ఇక పోటీపడలేము, ఇలాగే కొనసాగితే మళ్ళీ సైకిల్లు తొక్కడం మొదలెట్టాల్సిందే అంటున్నారు. నిజమే కదా పెట్రోల్ - డీజల్ ధరల పెంపుతో పాటుగా నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ జీతాలు, ఆదాయాలు మాత్రం పెరగడం లేదు. మరి ఈ జీవన ప్రయాణం ఎలా కోరుకున్న దారిలో నడిపించాలి అన్న ఆలోచన, ఆందోళన ప్రతి ఒక్క సామాన్యుడి మదిలో ఉండనే ఉంది. ఈ పెరుగుతున్న ధరలతో పోటీ పడలేక సామాన్యుడు చతికిల పడుతూ చెప్పుకునే దిక్కులేక అల్లాడిపోతున్నారు. మరి ఈ కష్టాలను తీర్చేదేవరు...ఈ పెట్రోల్ - డీజల్ ధరల పెరుగుదలకు కళ్లెం వేసేది ఎవరు ? అన్నదే అసలు ప్రశ్న.