పోలీస్ గొప్ప మనసు.. ఏం చేసాడో తెలుసా?

praveen
ప్రస్తుతం ఎండలు ఎంతలా పరిగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఇక జనాలు ఈ ఎండలకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎక్కడికైనా పొరపాటున బయటికి వెళ్లారు అంటే చాలు దాహం దాహం అంటూ ఇబ్బంది పడి పోతూ ఉన్నారు. ఎక్కడైనా దగ్గరలో ఎలాంటి పానీయాలు కనిపించినా తాగటం లాంటివి చేసి ఉపశమనం పొందుతూ ఉంటారు. లేదా తమవెంటే చల్లటి నీరు తీసుకెళ్లి ఇక దాహం వేసినప్పుడల్లా తాగటం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.

 అయితే ఇక మనుషులు అయితే దాహం వేయగానే దగ్గరలో ఉన్నా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్లి కూల్ డ్రింక్ తాగడం లేకపోతే రోడ్డుపై కనిపించే చెరుకు రసం తాగడం చేస్తూ ఉంటారు. ఏదీ కనిపించకపోతే ఎక్కడో ఒక దగ్గర వాటర్ బాటిల్ కొనుక్కొని దాహం తీర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మనుషులు అయితే దాహం తీర్చుకో గలరు.. కానీ ముగా జంతువుల పరిస్థితి ఏంటి.. ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఎన్నో జంతువులు ఆగమాగం అవుతున్నాయి. చెరువుల్లో కుంటల్లో ఉన్న నీళ్ళు కూడా ఎండిపోతున్న తరుణంలో అడవుల్లో ఉండే జంతువులు దాహం తీర్చుకోవడానికి ముప్పుతిప్పలు పడుతున్నాయి.

 ముఖ్యంగా కోతులు ఇక ఎండకు తాళలేక నీరస పడి చివరికి ఎక్కడికక్కడ స్పృహ కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఎంతోమంది మంచి మనసుతో ఇక కోతుల దాహాన్ని తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పోలీస్ అధికారి కూడా ఇలాంటిదే చేశాడు. దాహంతో అల్లాడిపోతున్న ఒక కోతికి ఓ పోలీస్ అధికారి సహాయం చేసాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ప్రత్యేకంగా ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసి మరీ చిన్న పిల్లాడికి నీళ్లు తాగిస్తున్నట్లుగా కోతికి నీళ్లు తాగి పిలిచాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇక వానరం నీళ్లు తాగే పద్ధతి చూస్తే ఎంతో దాహంతో ఉందో అర్థమవుతుంది. ఇక ఈ వీడియో చూసి ఎంతో మంది మనసు కదిలిపోతుంది. నిర్మానుష్య ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తే ఇక మూగజీవాల దాహం తీర్చవచ్చు అని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: