ప్యాసెంజర్ ని ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్!

frame ప్యాసెంజర్ ని ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్!

Purushottham Vinay
ఇక మీరు చాలా సార్లు చూసేవుంటారు కదులుతున్న రైలు ఎక్కడం ఇంకా దానిలో నుంచి దిగడం లాంటివి పదే పదే జరుగుతూ వుంటారు. అసలు అలాంటివి చేయోద్దంటూ పదే పదే చెబుతుంటారు రైల్వే అధికారులు.అయినా కాని కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ లాగా నేనింతే ఇలానే ఉంటా అనుకోని ఇలాంటి పనులు చేస్తూ ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇక ఇలాంటి సందర్భాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతుండగా.. కొందరు మహానుభావులు మాత్రం దేవుని దయ వల్ల తృటిలో బయటపడుతుంటారు. తాజాగా ఇక్కడ రైలు నుంచి కిందపడిన ప్రయాణికురాలి ప్రాణాలను మహిళా కానిస్టేబుల్ కాపాడింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఇంకా అలాగే ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లో ఇరుక్కుపోయిన ఒక మహిళా ప్రయాణికురాలిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ రక్షించింది. ఈ సంఘటన సాయంత్రం 6:26 గంటలకు జరిగిందని అక్కడ అధికారులు తెలిపారు.



ఇక చక్రధర్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ (18012) ప్లాట్‌ఫారమ్ నంబర్ 3 నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ మహిళ అదుపుతప్పి కిందపడిపోయింది. ఆ క్రమంలో రైలు ఇంకా అలాగే ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లో ఆమె చిక్కుకుంది. ఈ క్రమంలో ప్లాట్‌ఫారమ్‌పై అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వహీదా ఖాతూన్ వెంటనే అలెర్ట్ అయ్యి పరుగెత్తి ఆమెను పట్టుకొని పైకి లాగింది. వెంటనే ఆ లేడీ కానిస్టేబుల్ స్పందించడంతో ప్రయాణికురాలు అక్కడి నుంచి ఎంతో క్షేమంగా బయటపడిందని అక్కడి అధికారులు తెలిపారు.ఇక ఈ మేరకు ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. సకాలంలో స్పందించిన ఆ లేడీ కానిస్టేబుల్ ను రైల్వే అధికారులు ఎంతగానో అభినందించారు.ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: