వైరల్ : స్కూల్ బస్సులో.. బీర్లు తాగిన ఆడపిల్లలు?

praveen
ఇటీవలి కాలంలో స్కూల్ పిల్లలు ఎంత ఫాస్ట్ అయిపోయారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్కూల్ కి వెళ్లడం ఇంటికి రావడం ఇక అమ్మానాన్నలు చెప్పిన మాట వినడం.. శ్రద్దగా  చదువు కోవడం హోం వర్క్ చేసుకోవడం లాంటివి చేసేవాల్లం మన కాలంలో. ఇటీవలి కాలంలో మాత్రం చిన్న వయసులోనే ఎంతోఫాస్ట్ గా ఆలోచిస్తున్నారు. చదువుకోవడం విషయంలో కాదు చెడు అలవాట్ల విషయంలో. ఇక ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా స్కూలుకు వెళుతున్న విద్యార్థులను పూర్తిగా చెడిపోతున్నారు.. తప్పుదోవ పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు తెరమీదికి వస్తూ ఉన్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వారి తల్లిదండ్రులు వారిని ఎంతో శ్రద్ధగాచదువుకోవాలి అంటూ స్కూల్ కి పంపిస్తున్నారు. కానీ ఆవిద్యార్థులు మాత్రం పెడదోవ పట్టారు. చదువుకోవడం మానేసి చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోయారు. ఎంతలా అంటే ఏకంగా స్కూల్ బస్సులోనే బీర్లు తాగేంతలా చెడిపోయారు. వామ్మో విద్యార్థులు ఇంతలా చెడిపోయారు అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఇలా స్కూల్ బస్సులో బీర్లు తాగింది మగ పిల్లలు కాదు ఏకంగా ఆడపిల్లలు.


 ఈ ఘటన తమిళనాడులోని ఓ పాఠశాల బస్సులో వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని బస్సు లో మద్యం సేవిస్తూ ఉండగా ఆమె తాగుతున్నప్పుడు తోటి విద్యార్థులు వీడియో తీసారూ. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోలో విద్యార్థి నీతో పాటు మరికొంత మంది విద్యార్థునులు కూడా బీర్ బాటిల్ ఓపెన్ చేసి మద్యం తాగుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. స్కూల్ బస్సు లో మద్యం తాగుతున్న విద్యార్థులు అందరూ కూడా చంగాల్పట్టు లోని ఒక పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అన్న విషయం తేలింది.  ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యా శాఖ విచారణకు ఆదేశించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: