ఆమెకు 67, అతనికి 28.. కోర్టులో ప్రేమ..

Satvika
ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు మనసుకు నచ్చిన వ్యక్తి పై ప్రేమ కలుగుతుంది. అందుకే చూసే కళ్ళకు, ప్రేమించే మనసును బట్టి ప్రేమ పుడుతుంది. ఒక వయస్సులో కలిగితే అది ప్రేమ అంటారు. ఎవరికీ పడితే వాళ్ళకు పుడితే మాత్రం దానికి వేరే అర్థం వస్తుంది. ఈరోజుల్లో ప్రేమ కేవలం అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.. శారీరక సుఖం కోసం మాత్రమే జనాలు ఎగబడుతున్నారు.. కాగా ఇప్పుడు ఒక ప్రేమ జంట అందరి నోట్లో నానుతున్నారు. ఆమె వయస్సు 67, అతనికి 28 ఏళ్ళు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు శారీరక సుఖంగా మారింది.


అయితే ప్రేమను జీవితమంతా అనుభవిస్తాము.. కానీ పెళ్ళి మాత్రం చెసుకొము అని చెబుతున్నారు. వారి ప్రేమను అంగీకరించాలను కోర్టును కోరారు. దాంతో ఇది సంచలనంగా మారింది. వివరాల్లొకి వెళితే.. ఈ వింత అనుభూతి మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది..67ఏళ్ల బామ్మ, 28 ఏళ్ల యువకుడు కూడా ఇదే విషయాన్ని గురించి చెప్పారు.. ప్రేమ వారికి వయస్సును గుర్తు చెయలెదని, కేవలం మనసు మాత్రమే మాకు ముఖ్యం అని ఆ జంట అంటున్నారు. మా ప్రేమకు కేవలం నెంబరు మాత్రమే తేడా అని తెల్చి చెప్పారు..రిలేషన్ లో ఉంటాము కానీ పెళ్ళి చేసుకోబోము అని తేల్చి చెప్పారు. 


విషయాన్నికొస్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన 67ఏళ్ల రాంకాలి అనే మహిళ, 28ఏళ్ల భోలు అనే వ్యక్తి వున్నాడు. వీరి  ఇద్దరికీ కొన్నళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోబోమని అంటున్నారు. కొద్ది రోజులుగా  సహజీవనం చేస్తున్నట్టు చెప్పారు. పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఇలాగే కొనసాగుతుంది అనుకున్నాము అని అంటూన్నారు.. అయితే, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు ఇద్దరు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సహజీవనాన్ని ధ్రువీకరించుకునేందుకు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అలా ఈ ప్రేమ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: